iDreamPost
android-app
ios-app

రేపు రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేయనున్న సీఎం జగన్‌

  • Published Nov 16, 2020 | 10:17 AM Updated Updated Nov 16, 2020 | 10:17 AM
రేపు రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేయనున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఇప్పటికే ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా రుజువైంది. కరోనా మహమ్మారి వలన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా రైతులుకు జరగాల్సిన మేలు దగ్గర ఎక్కడ వెనకడుగు వేయకుండా రైతులకి అనేక సందర్భాల్లో అండగా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా రైతులకి అండగా ఉండేందుకు జగన్‌ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో పంట రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీ కూడా ఇప్పుడు చెల్లిస్తున్నామని సీజన్‌ పూర్తయిన వెంటనే ఇలా ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి అని, మొత్తం 48.60 లక్షల మంది రైతులకు క్లెయిమ్‌ల ప్రకారం సున్నా వడ్డీ రాయితీ కింద 510.30 కోట్లు ఇవ్వనున్నామని, ఇప్పటివరకూ 10,62,335 మంది రైతుల క్లెయిములకు సంబంధించి రూ.205.74 కోట్లు రేపు మంగళవారం ఇవ్వనున్నామని తెలిపారు.

అలాగే గత చంద్రబాబు ప్రభుత్వం రైతులు పెట్టి పొయిన 1,200 కోట్లు బకాయిలు తీరుస్తానని వైఎస్‌ జగన్‌ రైతులకు మాట ఇచ్చారని, ఆ మొత్తాలను సీఎం జగన్‌ నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం జమ చేస్తారన్నారు. ఇక జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెల వరకూ భారీ వర్షాలు, వరదల వలన రాష్ట్రంలో 93,908 హెక్టార్లలో పంటలు దెబ్బతిని మొత్తం 1,70,266 మంది రైతులు నష్టపోయినట్టు అంచనా వేశామని మంత్రి చెప్పారు.

ఏ సీజన్‌కు ఆ సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన ననేపథ్యంలో జరిగిన పంట నష్టానికి రూ.136.14 కోట్లను ఇప్పటికే రైతుల అకౌంట్లలో వేశామని ఇక అక్టోబర్‌లో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 1.67 లక్షల మంది రైతులకు చెందిన 77 వేల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, వంటి పంటలు దెబ్బతిన్నాయని, వారికి రూ.109 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వబోతున్నామని చెప్పారు. అలాగే 31 వేల మంది రైతులకు చెందిన 14 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, వారికి రూ.23.64 కోట్లు ఇస్తున్నామని మొత్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టపరిహారంగా దాదాపు రూ.133 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని మంగళవారం చెల్లించనున్నారని వివరించారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişbahis siteleri