Idream media
Idream media
రాష్ట్రం అభివృద్ధికి ప్రతి రంగమూ, ప్రతి శాఖా పనితీరు ముఖ్యమే. సాధారణంగా ఆయా శాఖల అధికారులు తమ విధులు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ కొన్నిచోట్ల ఫలితాలు కనిపిస్తాయి. మరికొన్ని చోట్ల సానుకూల ఫలితాలు వస్తాయి. అటువంటప్పుడే ఆ శాఖను గాడిన పెట్టేందుకు సరైన దిశా నిర్దేశం అవసరం. కారణాలు, లోపాలు తెలుసుకోవడం ముఖ్యం. ఆ పని నిరంతరం జరుగుతూ ఉండాలి. అప్పుడే లోపాలు అధిగమించి ఫలితాలొస్తాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తోంది అదే. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆయా శాఖల్లో పాలనను పరుగులు పెట్టించారు. అధికారులతో సమీక్షలు జరిపి ఆయా రంగాల్లోని లోటుపాట్లను క్షుణ్నంగా తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిందేమిటి..? ఇకపై చేయాల్సిందేమిటి.. అనే దానిపై అవగాహనకు వచ్చి తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన పనితీరును బట్టి తెలుస్తోంది. రోజూ సమీక్షలు – సమావేశాలు జరిపే సీఎం ఇప్పటి వరకూ లేదనడం అతిశయోక్తి కాదు. టూర్లు, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మినహా జగన్ దాదాపు రోజూ ఏదో శాఖపై సమీక్ష జరుపుతూనే ఉన్నారు.
అందుకే సాఫీగా సంక్షేమ పథకాలు…
నిత్యం జగన్ నిర్వహిస్తున్న సమీక్షల కారణంగానే ఏపీలో సంక్షేమ పథకాల అమలు సాఫీగా సాగుతోంది. ఈ 17 నెలల కాలంలో ఇప్పటి వరకూ ఏ చోటా కూడా పథకాల అమలులో లోపాలపై ఆందోళనలు జరిగిన దాఖలాలు లేవు. జగన్ పనితీరుకు ఇంత కన్నా నిదర్శనం అవసరం లేదు. ఏ పథకం ప్రారంభించినా.. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు, ఇవేవీ చూడకుండా ఎక్కడా వివక్షకు, అవినీతికి తావులేకుండా అర్హులకు కచ్చితంగా అందుతున్నాయా..? లేదా..? సమీక్షా సమావేశాల ద్వారా జగన్ తెలుసుకుంటున్నారు. దాని ఫలితంగానే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చదువు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏ అడ్డంకులూ లేకుండా సాగిపోతున్నాయి. అన్ని శాఖల పనితీరును జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశాల్లో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాటన్నంటినీ క్షుణ్నంగా పరిశీలిస్తూ తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు.
రోజూ ఏదో శాఖ..
ప్రతి రోజూ ఏదో రంగంపై జగన్ సమీక్ష జరుపుతూనే ఉన్నారు. ఇటీవల రోజులనే పరిశీలిస్తే.. విద్య, వైద్య రంగాలపై జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా జెండావిష్కరణ అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాజాగా సోమవారం ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్య పరంగా ఇప్పటి వరకూ చేపట్టిన సంస్కరణలు, వాటి ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో క్లాసులు ప్రారంభం, తీసుకుంటున్న చర్యలను సీఎంకు నివేదించారు. కోవిడ్ కాలంలో ఎనీటైం, ఎనీవేర్ లెర్నింగ్ పద్ధతిలో 5 లక్షల ఆన్లైన్ క్లాసులు నిర్వహించామని తెలిపిన అధికారులు దీనిని ఇంటర్నెట్తో అనుసంధానం చేసి మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆలోచనలు చేయాలన్న సీఎం జగన్ సూచించారు. కొవిడ్ కారణంగా వృథా అయిన కాలాన్ని కవర్ చేసే ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావొద్దని కూడా చెప్పారు. అలాగే యూనివర్సిటీలు, ప్రమాణాలు, స్కిల్ డవలప్ మెంట్ సెంటర్ల పని తీరును తెలుసుకుని తగిన దిశా నిర్దేశం చేశారు. అంతకు ముందురోజు నాడు –నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, సీహెచ్సీలు, పీహెచ్సీలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనుల పురోగతిపై స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఇలా.. ఒకటి, రెండు రోజులు కాదు, ఆ రంగం, ఈ రంగం కాదు.. 17 నెలలుగా ఏపీ సీఎం జగన్ అన్ని శాఖలపైనే నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టే ఫలి అన్నట్లు జగన్ పనితీరు కారణంగా ఏపీ అన్ని రంగాలలోనూ ఉత్తమ ర్యాంకులను పొందుతోంది.