iDreamPost
android-app
ios-app

మనసులు గెలుచుకున్న మెగాస్టార్ మెరుపులు

  • Published Dec 21, 2020 | 6:25 AM Updated Updated Dec 21, 2020 | 6:25 AM
  • Published Dec 21, 2020 | 6:25 AMUpdated Dec 21, 2020 | 6:25 AM
మనసులు గెలుచుకున్న మెగాస్టార్ మెరుపులు

గత సీజన్ తరహాలోనే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ 4కి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా హాజరై షోకి నిండుతనాన్ని, గ్లామర్ ని తీసుకొచ్చారు . తనరాక ఎప్పటికీ స్పెషలేనని, ఫ్రేమ్ లో ఉంటే ఇంకే ఆకర్షణ అక్కర్లేదని మరోసారి నిరూపించారు. ఊహించినట్టే తన టైమింగ్ తో మరోసారి మెగా ప్రత్యేకతను చాటుకున్నారు. అభిజిత్ మీద మంచి పంచులు వేయడమే కాక మోనాల్ తో ప్రేమకథ గురించి కూడా ప్రస్తావించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. హౌస్ మేట్స్ అందరితోనూ విడివిడిగా మాట్లాడి వాళ్ళ జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అందులో భాగంగానే వాళ్ళకు కానుకలు కూడా ఇచ్చారు.

సొహైల్ కోసం మటన్ బిర్యానీ తేవడం అన్నింటిలోకి హైలైట్. అతనో చిన్న సినిమా తీయాలని ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పగా అందులో క్యామియో చేస్తానని మెగాస్టార్ అక్కడే మాట ఇవ్వడం మరో షాక్. ప్రాక్టికల్ గా ఇవి ఎంత వరకు సాధ్యమవుతాయన్నది పక్కనపెడితే కోట్లాది ప్రేక్షకులు చూస్తున్న షోలో ఇలా నేరుగా మాట ఇవ్వడం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అరియానాను రాజనాలతో పోల్చిన చిరు అక్కడ కాసేపు నవ్వులు పంచారు. ఇక మెహబూబ్ ఏకంగా గాల్లో తెలిపోయేలా తనతో పోల్చుకోవడం చిరు వ్యక్తిత్వానికి నిదర్శనం. అంతే కాదు పది లక్షలు అతనికి ఇవ్వడం మరో గొప్ప విశేషం.

దివికి భవిష్యత్తులో తన సినిమా ఆఫర్ ఇస్తానని హామీ గుప్పించారు. గంగవ్వ ఇంటి పనులు ఎంతదాకా వచ్చాయని నాగార్జునని అడిగి తెలుసుకున్న చిరంజీవి ఆ నిర్మాణం తాలుకు ప్రోగ్రెస్ ని వీడియో రూపంలో వీక్షించారు. నిజంగా చిరంజీవి రాక షోకు ఎప్పటికీ మర్చిపోలేని కళ తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి, మెహ్రీన్, పరిణీత, లక్ష్మి రాయ్, తమన్ వీళ్ళందరినీ ఓవర్ టేక్ చేసి ఎపిసోడ్ అయ్యాక తను మాత్రమే గుర్తుండేలా మెగాస్టార్ చేసిన మేజిక్ భారీ రేటింగ్స్ తేవడం ఖాయమని అర్థమైపోయింది. అంచనా ప్రకారం ఈ షో హిస్టరీలో ఎప్పుడు రానంత భారీ టిఆర్పి వస్తుందని టీవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకో వారంలో క్లారిటీ వచ్చేస్తుంది

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişsezarcasinoMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet