iDreamPost
android-app
ios-app

బీజేపీ-జనసేనను గెలిపిస్తానంటున్న చింతమనేని

బీజేపీ-జనసేనను గెలిపిస్తానంటున్న చింతమనేని

సొంత పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకొని అధికార పార్టీలో చేరిన వేళ టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు చింతమనేని ప్రభాకర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏలూరు కార్పొరేషన్ లో బీజేపీ జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తానని బుధవారం ప్రకటించడంతో టిడిపి కార్యకర్తలు అయోమయం నెలకొంది.

వరుసగా కండువా మార్పు!

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని డివిజన్ల నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నా రు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా మంగళవారం మూడు డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా అయితే, బుధవారం మరో ముగ్గురు తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో ఆయా వార్డుల్లో టీడీపీ పోటీలో లేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు వచ్చిన చింతమనేని ఈ పరిస్థితితో అక్కడే ఉన్న మీడియాతో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో తాను ఏలూరులో జనసేన బిజెపి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని ఉద్వేగంతో మాట్లాడారు.

వరుస దెబ్బలు!

చింతమనేని ప్రభాకర్ కు పంచాయతీ ఎన్నికలు పెద్ద షాక్ ఇస్తే, ఇప్పుడు పక్కనే ఉన్న ఏలూరు నియోజకవర్గంలో టిడిపి రోజురోజుకు బలహీనం కావడం మరో తలనొప్పిగా తయారయింది. ఏలూరు రాజకీయాల్లో చింతమనేని కి తోడుగా దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఉండేవారు. బుజ్జి మరణం తర్వాత ఏలూరు టిడిపి మీద చింతమనేని పట్టు కోల్పోయారు.

సొంత నియోజకవర్గం దెందులూరుతో పాటు పక్కనే ఉన్న జిల్లా కేంద్రం ఏలూరులో సైతం టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం చింతమనేనికి మింగుడుపడటం లేదు. ముఖ్యంగా ఏలూరు టిడిపి ను నడిపించే నాయకుడు లేకపోవడంతో గత మూడు రోజుల్లో సుమారు పది డివిజన్లో నుంచి టిడిపి నాయకులు వైఎస్సార్సీపీలోకి జాయిన్ అయ్యారు. అంతా గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన వారు కార్పోరేటర్, ఇతర ఆలయాలకు కమిటీల పదవులు నిర్వహించిన వారు ఉన్నారు. దింతో కేవలం టీడీపీ 50 డివిజన్లలో 13 డివిజన్లలోనే అధికార పార్టీ కు సీరియస్ ఫైట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీడీపీ నాయకత్వం మీద నిరసన !

టీడీపీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ లో జాయిన్ అవుతున్న కార్యకర్తలు నాయకులు ఆ పార్టీ తీరు మీద, నాయకత్వ లేమి మీద బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం ముందుండి నడిపించే నాయకుడు కరువు అవ్వడం తోనే తాము పార్టీ మారుతున్నమని, రాజకీయాలకు అతీతంగా డివిజన్లోని ప్రజలందరూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతుండటంతో అధికార పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైస్సార్సీపీ లోకి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే టిడిపి నాయకులు మాత్రం అధికార పార్టీ నాయకులు బెదిరించి తమవారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారు అంటూ పాత పాటనే అందుకుంటున్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet