iDreamPost
android-app
ios-app

కాఫీ, టీలు మోశాను.. సెట్ ప్రాపర్టీలాగా వాడుకున్నారు.. ఎమోషనల్ అయిన ప్రగతి..

  • Published Jun 01, 2022 | 9:01 PM Updated Updated Jun 01, 2022 | 9:01 PM
కాఫీ, టీలు మోశాను.. సెట్ ప్రాపర్టీలాగా వాడుకున్నారు.. ఎమోషనల్ అయిన ప్రగతి..

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అమ్మ, అత్త పాత్రలతో మెప్పిస్తూ ఎన్నో సినిమాలు నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటూ ఈ ఏజ్ లో కూడా ఫొటోషూట్స్ చేస్తూ, జిమ్ లో కష్టపడుతూ ఆ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రగతి.. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహన్‌ హీరోయిన్స్‌గా వచ్చిన F3 సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని దిల్‌ రాజు నిర్మించారు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన F3 సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో ప్రగతి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.

ప్రగతి మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగ్గ పాత్రలు పడలేదన్న వెలితి ఎప్పుడూ ఉండేది. కొన్ని సార్లు వచ్చే పాత్రలు నచ్చక, అవి చేయలేక సినిమాలకి కొన్నిరోజులు బ్రేక్‌ కూడా తీసుకున్నాను. కెరీర్ ఆరంభంలో కాఫీ, టీలు మోశాను. చిన్న చిన్న పాత్రలు, పెద్ద విలన్‌ పక్కన ఊరికే నిల్చునే పాత్రలు, అందమైన, యంగ్‌ అమ్మ, అత్త పాత్రలు.. ఇలా చాలానే చేశాను. చాలా మంది నన్ను ఆర్టిస్ట్ గా కంటే కూడా ఒక సెట్‌ ప్రాపర్టీగానే వాడనుకున్నారు సినిమాల్లో. అందుకే చాలా క్యారెక్టర్స్ సంతృప్తి ఇవ్వలేదు. కానీ ఒక మంచి పాత్ర F2 రూపంలో వచ్చింది. తర్వాత F3లో కూడా అవకాశం వచ్చింది. ఈ పాత్రలకి ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నాకు చాలా సంతృప్తినిచ్చింది అని ఎమోషనల్‌ అయ్యారు ప్రగతి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş