iDreamPost
android-app
ios-app

నన్ను లోకేష్ ని చంపేస్తారట : చంద్రబాబు

  • Published Nov 30, 2022 | 6:31 PM Updated Updated Nov 30, 2022 | 6:31 PM
  • Published Nov 30, 2022 | 6:31 PMUpdated Nov 30, 2022 | 6:31 PM
నన్ను లోకేష్ ని చంపేస్తారట : చంద్రబాబు

మీకు పోలీసులు ఉంటే నాకు ప్రజలు ఉన్నారంటూ సెంటిమెంట్ రగిల్చేందుకు విఫల యత్నం

ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి ఏ అస్త్రాలు దొరకని సందర్భంలో తనని ఏదో చేయబోతున్నారు. తన వెనక ఏదో కుట్ర జరుగుతోంది. మీరే నాకు అండ, మీరంతా నా వైపు ఉండండి. నాకు మీరున్నారు అంటూ సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసే యత్నాలు రోజురోజుకీ హాస్యాస్పదంగా మారుతున్నాయి . ఇది ఈనాటిది కాకపోయినా ఓటుకి నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నాటి నుండి బాబు నోటి నుండి ఈ తరహా విచిత్ర వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి.

నాడు ఓటుకి నోటు కేసులో అడ్డంగా దొరికిన తర్వాత ఇదంతా నా పై కుట్ర, నా ఫోన్లు టాప్ చేశారు. మీకు పోలీసులు ఉంటే నాకు పోలీసులు ఉన్నారు. మీకు ఏసీబి ఉంటే నాకూ ఏసీబి ఉంది అంటూ నాడు ఏ పోలీసుల్ని తన ధైర్యంగా చూపి కేసీఆర్ ని బుకాయించబోయాడో నేడు అదే పోలీసులని దోషులుగా చూపుతూ జగన్ కి పోలీసులు ఉంటే నాకు ప్రజలు ఉన్నారనడం పోలీసు వ్యవస్థ పై నిరాధార ఆరోపణలు చేస్తూ వారిని కించపరచడం దారుణం .

2018 లో బిజెపితో పొత్తుని తెగదెంపులు చేసుకొన్నాక ఒకానొక సందర్భంలో మోడీ నా భుజం పై గట్టిగా చరిచాడు, ఒంటరిగా దొరికితే నన్ను కొడతారేమో మీరంతా వలయంగా ఉండి నన్ను కాపాడుకోండి తమ్ముళ్లు. నేను దేశాన్ని ఏకం చేసి మోడీని దించేస్తా అంటూ పిలుపులిచ్చిన బాబు నేడు అదే మోడీ కరుణ కోసం ప్రాకులాడుతూ ప్రధాని నాకు షేక్ హ్యాండించ్చాడు, నన్ను తరుచుగా ఢిల్లీ రమ్మన్నాడు అని ప్రచారం చేసుకోవటం చూసినాకా టీడీపీ శ్రేణులు కూడా బాబు విచిత్ర ఆరోపణలు నమ్మడం మానేశారు.

ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్ కేటగిరి రక్షణలో ఉన్న చంద్రబాబు ఈ తరహా అభూతకల్పనలు, నిరాధార ఆరోపణలతో నవ్వుల పాలు అవుతున్నా ఆయన అర్ధం చేసుకోకుండా అదే ధోరణిలో సానుభూతి ప్రయత్నాలు చేయడం చూసి టీడీపీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio