iDreamPost
android-app
ios-app

చౌకబారు రాజకీయమేల చంద్రబాబు?

చౌకబారు రాజకీయమేల చంద్రబాబు?

రాజకీయాలు హుందాగా ఉండాలి. నాయకుల విమర్శలు వాస్తవాలను ప్రతిభింభించాలి. కానీ, రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి రాజకీయం అత్యంత చౌకబారుగా సాగుతోంది. కార్యక్షేత్రంలో ఎక్కడా కనిపించని ఆయన కెమరాలు మందు మాత్రం గంటల తరబడి ఎంపిక చేసిన ఎన్‌ఆర్‌ఐలు, డాక్టర్లు, పార్టీ నేతలతో వీడియో కాన్ఫెరెన్స్‌లు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ వైఫల్యంపై ప్రతి ఆదివారం కేంద్రానికి నివేదిక పంపుతున్నాని చెప్తున్నారు.

ఇదా చేయాల్సింది….

అధికార పక్షం చేతిలో పవర్‌ ఉంటుంది. కానీ, ప్రతిపక్షం ప్రజాపక్షమైతే అధికార పక్షం సైతం విపక్షం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. కానీ, ఏపీలో ప్రతిపక్షం కొంచెం కూడా నిర్మాణాత్మకతను ప్రదర్శించడం లేదు. కరోనా కేంద్రంగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి రాజకీయం అత్యంత చౌకబారుగా సాగుతోంది. బాధ్యతగల ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఉండి కరోనాపై పోరులో తన వంతు బాధ్యతను నిర్వర్తించకుండా…నాలుగు గదుల మధ్య ఉంటూ కరోనా మృతులకు రూ.10 లక్షలు ఇవ్వాలి, సరుకులు ఇంటికి పంపాలి, రాష్ట్రంలోని పరిస్థితులకు నా గుండె తరుక్కుపోతుంది అంటూ విమర్శులు చేయడం విడ్డూరమే.

వీడని సమీక్షల సంస్కృతి

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు నిత్యం సమీక్షల పేరుతో అధికార యంత్రాంగాన్ని పనిచేయనీయని చంద్రబాబు…ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత కూడా సమీక్షల సంస్కృతిని వదులుకోలేకపోతున్నారు. నిత్యం ఎంపిక చేసిన ఎన్‌ఆర్‌ఐలు, డాక్టర్లు, పార్టీ నేతలతో వీడియో కాన్ఫెరెన్స్‌లు పెడుతున్నారు. ఆ సందర్భంగా వాస్తవాలను వక్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వీడియో కాన్ఫెరెన్స్‌ల్లో పాల్గొంటున్న కొంతమంది వ్యక్తులు ఇస్తున్న సలహాలు బహు విచిత్రంగా ఉంటున్నాయి. ఏకంగా సమాంతర ప్రభుత్వం నడపాలంటూ కొందరు చంద్రబాబుకు సూచిస్తుండటం గమనార్హం. బాధ్యతగల నాయకుడిగా ఆ వ్యాఖ్యలను ఖండించాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోవడం ఆక్షేపణీయం.

నివేదికలిస్తున్నా…..

వీడియో కాన్ఫెరెన్స్‌ల సందర్భంగా చంద్రబాబు చేస్తున్న కుటిలియత్నాలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రతి ఆదివారం కేంద్రానికి నివేదిక పంపుతున్నాని చంద్రబాబు చెప్పడమే దీనికి నిదర్శనం. ఒకప్పుడు రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం ఏమిటి? కేంద్రం ఆటలు సాగనివ్వను? దేశంలోని నాయకులందరినీ కలుపుకొని ఫెడరల్‌ వ్యవస్థను కాపాడుతా అంటూ బీరాలు పలికిన చంద్రబాబు అధికారం కోల్పోగానే రాష్ట్ర ప్రభుత్వ స్వంత్రత అనే పదాన్ని తన డిక్షనరీలో నుంచి తొలగించేయడం గమనార్హం.

కేంద్రం రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెప్పించుకుంటుంది. గవర్నర్లు సైతం తరుచూ ఢిల్లీకి నివేదికలు పంపుతుంటారు. కానీ, చంద్రబాబు ఏపీలో కేంద్రానికి తెలియనిదేదో ఏపీలో జరుగుతోందంటూ నివేదికలు పంపుతుండటం శోచనీయం. తద్వారా కరోనాపై అత్యంత సమర్థమంతంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి రాష్ట్ర పరువును భజారున పడేయాలనుకోవడం గర్హనీయం.

కుల రాజకీయాలు సైతం….

ఓ వైపు కరోనా చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉంటే చంద్రబాబునాయుడు వర్చువల్‌ కుల రాజకీయాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో దళితలపై ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తోంది, దాడులకు పాల్పిడిన వారిపై చర్యలు తీసుకోవట్లేదు అంటూ విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు. తద్వారా వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలుస్తున్న దళిత ఓటు బ్యాంక్‌ను చీల్చాలని ప్రయత్నిస్తున్నారు. అయితే దళితులు చంద్రబాబునాయుడి మాటలను ఏమేరకు నమ్ముతారనేది సందేహాస్పదమే.

jojobet girişmarsbahisJojobet GirişJojobet GirişCasibomcasibom girişholiganbettaraftarium24madridbet girişmadridbet girişmadridbetJojobet Girişkatla