iDreamPost
android-app
ios-app

పెద్దిరెడ్డి స‌వాల్ ను చంద్ర‌బాబు స్వీక‌రిస్తారా?

పెద్దిరెడ్డి స‌వాల్ ను చంద్ర‌బాబు స్వీక‌రిస్తారా?

ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు మాట‌ల్లో స‌ర్కారుపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు.. ఇవే ఎక్క‌వ‌గా క‌నిపిస్తున్నాయి. ఆధారాల‌తో మాట్లాడింది మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌పై పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. బాబుకు ఓ స‌వాల్ విసిరారు. 

ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపక్షాల మధ్య చాలెంజ్ ల పర్వం నడుస్తోంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు కు సవాల్ విసిరారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్ర‌మ మైనింగ్ చేసిన‌ట్టు చంద్రబాబు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి.

చంద్ర‌బాబు సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి చిత్తూరు జిల్లాకు ఏం చేశారని మంత్రి ప్ర‌శ్నించారు. కుప్పంను అభివృద్ది చేయాల‌ని క‌ల‌లు క‌న్నట్టు చంద్రబాబు చెబుతారు, మరి 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశార‌ని మంత్రి నిలదీశారు. ఐదేళ్లలోనే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు దేవుడయ్యార‌ని మంత్రి చెప్పారు. చంద్ర‌బాబు చిత్తూరు జిల్లాలో పుట్ట‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌న్నారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు మైనింగ్ రాయ‌ల్టీపై క‌న్ సెషన్ ఎందుకు ఇచ్చార‌ని మంత్రి పెద్దిరెడ్డి అడిగారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబును తప్ప‌కుండా ఓడిస్తామ‌ని, ఇది త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని మంత్రి అన్నారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా చిత్తూరు జిల్లా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని అన్నారు.

కుప్పం నియోజకవర్గంలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగానే కాదు.. తాజాగా నేత‌ల మీటింగ్ లో కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేేశారు. కుప్పంలో వరుసగా జరిగిన స్థానిక సంస్థలు – మున్సిపల్ ఎన్నికల్లో తనను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన పెద్దిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పుంగనూరులో ఓడిస్తానని చంద్రబాబు శ‌ప‌థం చేశారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి సైతం ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటం పెద్ద కష్టం కాదని ధీమా వ్యక్తం చేేశారు.

Also Read : గొంతెమ్మ కోరికలతో బాబు నిరసన పిలుపు..

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş