iDreamPost
android-app
ios-app

ప్రేయసికి ఖర్చు పెట్టిందంతా వసూలు చేయాలని లెక్క రాసి.. ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

  • Published Jun 01, 2022 | 8:16 AM Updated Updated Jun 01, 2022 | 8:16 AM
ప్రేయసికి ఖర్చు పెట్టిందంతా వసూలు చేయాలని లెక్క రాసి.. ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

ఇటీవల పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలానే చూశాము. పెళ్ళికి నో చెప్పారని కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక లవ్ లో ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరు ఖర్చు చేయడం కామన్. ఎక్కువగా అబ్బాయిలే అమ్మాయిల సంతోషం కోసం, ఆమెకు కావాల్సినవి కొనివ్వడానికి ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఈ ప్రియుడు మాత్రం పెళ్ళికి నో చెప్పిందని ఆమె కోసం ఖర్చు పెట్టిన డబ్బంతా లెక్క రాసి అదంతా వసూలు చేయాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యంతో పాటు షాక్ కి గురి చేసింది.

కర్ణాటక చిక్ మగళూరు జిల్లా శంకరపురకు చెందిన 31 ఏళ్ళ యువకుడు చేతన్‌ తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆమె సరదాలు, సంతోషాల కోసం చేతన్ బాగానే ఖర్చు పెట్టాడు. సరకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవించే చేతన్‌ తన ఆదాయంలో ఎక్కువ శాతం తన ప్రేయసి కోసమే ఖర్చు పెట్టేవాడట. గతంలో కొన్ని సార్లు ఆమె కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది, ఆమె తనతో ఎక్కువ ఖర్చు పెట్టిస్తుందని స్నేహితుల వద్ద కూడా చెప్పి బాధపడ్డాడట.

ఇటీవల చేతన్ పెళ్లి చేసుకుందామని ఆ యువతిని అడిగితే ఆమె ఒప్పుకోలేదు. మళ్ళీ మళ్ళీ అడిగి చూసినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె ప్రవర్తనతో విసిగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతన్ చనిపోతూ ఓ లెటర్ ని రాసి వెళ్ళాడు. పోలీసుల కథనం ప్రకారం ఆ లేఖలో తన ప్రేయసి సరదాల కోసం దాదాపు 4.50 లక్షల రూపాయలు ఖర్చు చేశానని, ఆమెని చాలా ప్రేమించానని, ఆమె కోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా ప్రేయసి కోసం ఖర్చు పెట్టింది వసూలు చేయాలని లేఖ రాసి చనిపోవడంతో ఈ సూసైడ్ వైరల్ గా మారింది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş