iDreamPost
android-app
ios-app

ముగ్గురు స్టార్లకు ఫ్లాప్ ఇచ్చిన ‘బాస్’ – Nostalgia

  • Published Dec 25, 2020 | 5:42 AM Updated Updated Dec 25, 2020 | 5:42 AM
ముగ్గురు స్టార్లకు ఫ్లాప్ ఇచ్చిన  ‘బాస్’ – Nostalgia

సినిమా పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్లు వింతగా అనిపిస్తాయి కానీ వాటిని విశ్లేషిస్తే మాత్రం ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడతాయి. మూవీ ఏదైనా కంటెంట్ లో బలం ఉంటేనే విజయం సాధిస్తాయనే మాటలో నిజముంది కానీ కొన్నింటిని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఓ ఉదాహరణ చూద్దాం. బాస్ అనే పదం ఎంత పవర్ ఫుల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాఫియా డెన్స్ లో, కార్పోరేట్ ఆఫీస్ లో, పోలీస్ డిపార్ట్ మెంట్ లో పైవాళ్ళను బాస్ అని పిలవడం సర్వసాధారణం. ఆ వర్డ్ లో అంత పవర్ ఉంది. అంత పవర్ ఫుల్ టైటిల్ ని స్టార్ల సినిమాలకు పెడితే అభిమానులకు ఎలా ఉంటుందో వేరే చెప్పాలా.

1995 ఫిబ్రవరిలో విజయశాంతి ప్రధాన పాత్రలో లేడీ బాస్’ విడుదలైంది. అప్పటికే ఈ ఇద్దరి కాంబోలో శత్రువు, పోలీస్ లాక్ అప్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉండటంతో అంచనాలు భారీగా నిలిచాయి. అయితే అనూహ్యంగా లేడీ బాస్ ఫ్లాప్ అయ్యింది. బాయ్ కట్ లో విజయశాంతిని కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసి కొట్టింది. అతిశయోక్తితో కూడుకున్న కథనంతో పాటు బేబీ సెంటిమెంట్ ని ఇరికించడం మాస్ కి నచ్చలేదు. కీరవాణి సంగీతం కూడా ఆదుకోలేకపోయింది. కట్ చేస్తే అదే సంవత్సరం జులైలో చిరంజీవి ‘బిగ్ బాస్’ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ప్రకటన వచ్చినప్పటి నుంచి దీని మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

‘గ్యాంగ్ లీడర్’ దర్శకుడు విజయబాపినీడు అంతకన్నా గొప్పగా చిరుని చూపించాలన్న తాపత్రయం ఫలితాన్ని ఇవ్వలేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామాని సరిగా హ్యాండిల్ చేయలేక తడబడటంతో డిజాస్టర్ తప్పలేదు. బప్పీలహరి పాటలు మాత్రమే ఆడియో పరంగా పాస్ అయ్యాయి. 2006 సెప్టెంబర్ లో నాగార్జున హీరోగా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ‘బాస్’ వచ్చింది. నయనతార హీరోయిన్. కనీసం అభిమానులకు కూడా సంతృప్తి పరచలేక బాస్ పట్టుమని రెండు వారాలు థియేటర్లో నిలవడం కూడా కష్టమైపోయింది. నేనున్నాను కాంబో మేజిక్ రిపీట్ కాలేదు. ఇలా ‘బాస్’ టైటిల్ చిరంజీవి, విజయశాంతి, నాగార్జునలకు ఇంత పెద్ద ఫ్లాపు ఇవ్వడం విచిత్రమే.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet giriş