iDreamPost
android-app
ios-app

కపిల్ శర్మ షోలో సినిమాని ప్రమోట్ చేయాలి అంటే ఎంత తీసుకుంటారో తెలుసా?? కపిల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

  • Published Jun 24, 2022 | 7:05 PM Updated Updated Jun 24, 2022 | 7:05 PM
కపిల్ శర్మ షోలో సినిమాని ప్రమోట్ చేయాలి అంటే ఎంత తీసుకుంటారో తెలుసా?? కపిల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

బాలీవుడ్ టాక్ షో లలో బెస్ట్ షోలలో ఒకటి ది కపిల్ శర్మ షో. కమెడియన్ కపిల్ శర్మ కొంతమంది సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు ఈ షోలో. ఈ ఇంటర్వ్యూ చాలా సరదాగా, ఫన్నీగా ఉంటుంది. ఈ కార్యక్రమం మొదటిసారిగా 2016లో మొదలైంది. అప్పట్నుంచి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ బాగా పాపులర్ అయింది ఈ షో.

ఇక ఈ షోలో కపిల్ శర్మతో పాటు అతని టీం కూడా ఉంటుంది. సుమోనా చక్రవర్తి, చందన్ ప్రభాకర్, రాచెల్ రావు, సునీల్ గ్రోవర్, అర్చన పురాణ సింగ్, సుదేష్, భారతి, కృష్ణ అభిషేక్, కికు శారదా.. కపిల్ టీంలో ఉంటారు. వీరంతా షోలో సరదాగా నవ్విస్తూ ఉంటారు, వివిధ గెటప్స్ వేసి అలరిస్తారు. వచ్చిన సెలబ్రిటీలని ఇమిటేట్ చేస్తారు. ఇలా అందరూ కలిసి ఈ షోని బాగా హిట్ చేశారు.

మొదట్లో ఈ షో కోసం కపిల్ శర్మ షో ఒక్కో ఎపిసోడ్‌కు 20 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే వాడు. మొదటి సీజన్ బాగా హిట్ అవ్వడంతో నెక్స్ట్ సీజన్ ఒక్కో ఎపిసోడ్ కి కపిల్ రూ. 30 లక్షలు వసూలు చేశాడు, ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కి కపిల్ దాదాపు రూ. 50 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. షోకి ప్రజాదరణ బాగుండటంతో నిర్వాహకులు కూడా అంత ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఈ షో జనాల్లో బాగా రీచ్ అవ్వడంతో చాలా సినిమాలు తమ సినిమాలని ఇక్కడ ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. మొదటి సీజన్ లో ఫ్రీగానే ప్రమోట్ చేసినా ఆ తర్వాత షో రేంజ్ పెరగడంతో ఇప్పుడు ఒక్కో సినిమాని కపిల్ శర్మ షోలో ప్రమోట్ చేయడానికి నిర్వాహకులు దాదాపు 25 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet