iDreamPost
android-app
ios-app

నేను బికినీ వేసి ఫోటోలు పోస్ట్ చేస్తాను.. కానీ మా నాన్నకి కనపడకుండా బ్లాక్ చేస్తాను..

  • Published Jun 22, 2022 | 7:00 AM Updated Updated Jun 22, 2022 | 7:00 AM
నేను బికినీ వేసి ఫోటోలు పోస్ట్ చేస్తాను.. కానీ మా నాన్నకి కనపడకుండా బ్లాక్ చేస్తాను..

బాలీవుడ్ బుల్లితెర నటి కనిక మన్‌ ఇప్పుడిప్పుడే మరింత పాపులర్ అవుతుంది. సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నిర్వహిస్తున్న ఖత్రోన్‌ కె ఖిలాడీ అనే షోలో పాల్గొంటుంది కనిక ప్రస్తుతం. ఇటీవల ఖత్రోన్‌ కె ఖిలాడీలో ఇచ్చిన కొన్ని టాస్కుల్లో కనికకి కాళ్ళకి, చేతులకి గాయాలయ్యాయి. ఆ గాయాలతోనే షూటింగ్‌ కొనసాగించింది. కానీ ఆ తర్వాత మాత్రం చేతులు, కాళ్లు కదపలేకపోయింది.

కొన్నిరోజుల క్రితం ఈ విషయం బాలీవుడ్ లో వైరల్ గా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన కనిక ఈ షో గురించి, తన గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలని చేసింది. కనిక మీడియాతో మాట్లాడుతూ.. ఖత్రోన్‌ కె ఖిలాడీలో మొదటి స్టంట్‌లోనే గెలిచాను. షోలో నేను చేసిన స్టంట్స్ వల్ల నాకు గాయాలయ్యాయి, మెడపై అలర్జీ వచ్చింది. ఇవన్నీ తెలిసి నాన్న వచ్చేయమన్నారు. కానీ నేను ఇప్పుడిప్పుడే షోని అర్ధం చేసుకుంటున్నాను అని తెలిపింది.

ఇక షోలో వాళ్ళు మమ్మల్ని బికినీ వేసుకోమన్నారు. గతంలో కూడా నేను బికినీ వేసుకొని ఫోటోలు దిగాను. ఇప్పుడు కూడా బికినీ వేసుకొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను, కానీ అవి మా నాన్నకి కనపడకుండా ఉండేందుకు మా నాన్నని బ్లాక్ చేశాను. అయితే మా సోదరిని బ్లాక్ చేయను. దీంతో మా సోదరి ఆ బికినీ ఫోటోలు మా నాన్నకి చూపిస్తుంది. మా నాన్న నాకెందుకు ఆ ఫోటోలు కనపడట్లేదని అమాయకంగా అడుగుతాడు అని తెలిపింది. కనికకి సోషల్ మీడియాలో దాదాపు 7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş