iDreamPost
android-app
ios-app

Voter ID-Aadhaar Link, Lok Sabha – బీజేపీలో ఏమిటీ మార్పు.. అన్నీ మెచ్చే నిర్ణయాలే

Voter ID-Aadhaar Link, Lok Sabha – బీజేపీలో ఏమిటీ మార్పు.. అన్నీ మెచ్చే నిర్ణయాలే

కారణాలు ఏమైనా ఏడాది ముగింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు మెచ్చే కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. పలు కీలక బిల్లులపై కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. వాటిని వెంటనే అమల్లోకి తెచ్చేలా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ముందుకు బీజేపీ సర్కార్‌ తెస్తోంది. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ సంస్థలకు రంగ ప్రవేశం కల్పించేలా కొత్తగా తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాది పాటు ఉద్యమం చేయగా.. ఎట్టకేలకు వారి అభీష్టానికి అనుగుణంగా సాగు చట్టాలను రద్దు చేశారు. చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అమోదించారు. 

ఇటీవల బాలిక వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన బిల్లులు రేపో మాపో పార్లమెంట్‌ ముందుకు రానుంది. అంతకు ముందుగా.. చాలా కాలం నుంచి పెడింగ్‌లో ఉన్న ఓటర్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం బిల్లును ఈ రోజు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ నెల 16వ తేదీన ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలా కేబినెట్‌ ఆమోదించడం, ఇలా పార్లమెంట్‌ లో బిల్లు పెట్టడం, చట్టంగా రూపుదాల్చడం చకచకా జరిగిపోతున్నాయి.

ఓటర్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసే నిర్ణయం భారత ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టంగా చెప్పవచ్చు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్‌ను ఈ నిర్ణయం సరికొత్త తీరాలకు చేరుస్తుందనడంలో సందేహం లేదు. ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా, ప్రజా తీర్పు విస్పష్టంగా వెల్లడయ్యేలా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. దొంగ ఓట్లు వేసే వారికి, వేయించే కొన్ని రాజకీయ పార్టీలు, నేతలకు ఈ నిర్ణయంతో చెక్‌ పడనుంది. గెలిస్తే.. తమ విజయమని, ఓడిపోతే దొంగ ఓట్లు వేశారంటూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును అవహేళన చేసే రాజకీయ నేతల నోళ్లు కూడా ఇకపై శాశ్వతంగా మూతపడడం ఖాయం.

Also Read :   ఒకే అంశం.. రెండు మాటలు.. ఇలా ఎలా సాధ్యం..?

ఎన్నికల్లో వీలున్న చోట్ల తానే దొంగ ఓట్లు వేయడం.. వీలు కాని చోట్ల, ప్రత్యర్థి గెలవడం ఖాయమని తేలిన చోట్ల దొంగ ఓట్లు వేయిస్తున్నారని ప్రచారం చేయడం.. ఉత్తుత్తి ఫిర్యాదులు, ధర్నాలు వంటి దుష్ట పన్నాగాలకు ముగింపు పలకడంతో పాటు దొంగ ఓట్లు వేసే అవకాశమే లేకుండా చేసేందుకు ఎన్నికల సంఘం ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దీన్ని చేర్చి చాలా ఏళ్ల క్రితమే కేంద్ర న్యాయశాఖకు పంపింది. ఆధార్ అనుసంధానం వల్ల లక్షలాది వలస జీవులు ఓటు వేయడానికి స్వగ్రామాలకు వెళ్లనవసరం లేకుండా ఉన్న ప్రాంతంలోనే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించవచ్చని సూచించింది. దీనివల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని పేర్కొంది. మరోవైపు తానే స్వయంగా ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే ఓటర్-ఆధార్ అనుసంధానానికి 1950 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని.. అప్పటివరకు అనుసంధానం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ఇన్నాళ్లకు మోక్షం..

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంలో ఇన్నాళ్లు అలసత్వం ప్రదర్శించింది. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయన్న సాకుతో కేంద్ర న్యాయశాఖ పరిశీలన పేరుతో కాలయాపన చేసింది. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదముందని వాదిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు, ఫోన్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, పీఎఫ్ అకౌంట్, రేషన్.. ఇలా ప్రతిదానికీ ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి చేశారు. వాటికి లేని అభ్యంతరం, చోరీ భయం ఓటర్ కార్డుతో అనుసంధానానికే ఎందుకు అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆధార్ అనుసంధానానికి కేంద్రం ముందుకు రావడం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

మరిన్ని నిర్ణయాలు..

ఓటర్ కార్డ్-ఆధార్ అనుసంధానంతోపాటు మరో రెండు సవరణలకు కేంద్రం ఆమోదించింది. దాని ప్రకారం ప్రస్తుతం ఏటా ఒకసారి మాత్రమే జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమం ఇక నుంచి నాలుగుసార్లు జరగనుంది. ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్లుగా నమోదయ్యే అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 18 ఏళ్లు నిండిన వారందరూ మళ్లీ జనవరి ఒకటో తేదీ వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నిరీక్షణ లేకుండా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో అప్పటికి వయసు అర్హత సాధించినవారికి  ఓటర్లుగా నమోదయ్యే అవకాశం తాజా బిల్లుతో లభిస్తుంది.

Also Read : జగన్ సంస్కరణలు.. రెండేళ్లలోనే ఫలితాలు

రక్షణ దళాల్లో పనిచేస్తున్న సర్వీసు ఓటర్ల విషయంలో ఉన్న అసమానతను కూడా తొలగిస్తూ సవరణ చేశారు. సైనిక దళాల్లో పనిచేస్తున్న పురుషులతోపాటు వారి భార్యలను సర్వీస్ ఓటర్లుగా గుర్తిస్తున్నారు. కానీ అదే రక్షణ దళాల్లో పని చేస్తున్న మహిళల భర్తలను మాత్రం సర్వీసు ఓటర్లుగా గుర్తించడం లేదు. దీన్ని సవరించి మహిళా సైనికుల భర్తలను కూడా సర్వీసు ఓటర్లుగా గుర్తించేలా సవరణ చేశారు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom Giriş