iDreamPost
android-app
ios-app

కోటీశ్వరుడు బిగ్ బాస్ – ఇద్దరూ రెడీ

  • Published Jun 06, 2021 | 10:04 AM Updated Updated Jun 06, 2021 | 10:04 AM
కోటీశ్వరుడు బిగ్ బాస్ – ఇద్దరూ రెడీ

రాబోయే రోజుల్లో ప్రసారానికి రెడీ అవుతున్న తెలుగు టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలు బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరుడు దానికి తగ్గ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో అసలు ఇవి స్టార్ట్ అవుతాయా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ నిర్వాహకులు దీనికి సంబంధించిన పనుల్లో తలమునకలై ఉన్నారు. బిగ్ బాస్ 5 కోసం ఇప్పటికే వీడియో కాల్స్ ద్వారా ఆడిషన్లు, చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన డీల్స్ మాత్రం బిగ్ బాస్ ప్రతినిధులు ప్రత్యేకంగా లాక్ డౌన్ లేని టైంలో వెళ్లి సదరు పార్టిసిపెంట్స్ తో మాట్లాడుతున్నారట. ఎవరు అనే పేర్లు తదితర వివరాలు మాత్రం బయటికి రావడం లేదు.

నాగార్జుననే మరోసారి హోస్ట్ చేయడం ఖాయం. షూట్ ని ఆగస్ట్ లో మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమాకు లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడటంతో దానికి అనుగుణంగా షో షెడ్యూల్స్ ని ప్లాన్ చేయబోతున్నారు. ఒక్కసారి పాల్గొనే వాళ్ళ లిస్టు ఫైనల్ అయ్యాక అప్పుడు వంద రోజుల ప్రోగ్రాంతో పాటు వెన్యూని ఎప్పటి లోగా సిద్ధం చేయాలనే దాని మీద ఒక కంక్లూజన్ కు వస్తారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కోసం జెమిని టీవీ సన్నాహకాల వేగం పెంచించి. మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న ప్రమోషన్లకు మరోసారి గేరు మార్చి  స్పీడు పెంచారు.

ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, కొరటాల శివ సినిమాలతో బిజీగా ఉన్నా మధ్యలో ఈ షోకు అవసరమైన మేరకు డేట్లు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే జెమిని దీని మీద భారీ బడ్జెట్ పెడుతోంది. ఆల్రెడీ వేరే ఛానల్ లో చిరంజీవి, నాగార్జున వాళ్ళు నడిపిన షో కాబట్టి దాంతో పోలిక రాకుండా మేకింగ్ లోనూ కాన్సెప్ట్ లోనూ కొత్తగా కనిపించేలా బాగానే కష్టపడుతోందట, ఇటీవలి కాలంలో రేటింగ్స్ విషయంలో స్టార్ మాతో గట్టి పోటీ ఎదురుకుంటున్న జెమినికి కేవలం కొత్త సినిమాలు సరిపోవడం లేదు. అందుకే షోల మీద ఫోకస్ పెడుతూ పబ్లిసిటీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. చూద్దాం

Jojobet GirişmeritbetcasibomTophillbet girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetcasibomMadridbet girişMadridbetcasibommatbet girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom Girişdeneme bonusuGrandPashaBet ŞikayetJojobet