iDreamPost
android-app
ios-app

రైతు సమస్యలో ప్రేమ కథ

  • Published Feb 18, 2020 | 6:22 AM Updated Updated Feb 18, 2020 | 6:22 AM
రైతు సమస్యలో ప్రేమ కథ

ఇంకో మూడు రోజుల్లో భీష్మ సందడి మొదలవుతుంది. సంక్రాంతి తర్వాత చల్లారిపోయిన జోష్ ని ఈ సినిమా ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. వరసగా మూడు డిజాస్టర్ల ట్రాక్ రికార్డు ప్రభావం నితిన్ మీద అంతగా పడకపోవడం అభిమానులకు ఊరట కలిగిస్తోంది. దానికి తోడు భారీ రేట్లకు అమ్మకపోవడం బయ్యర్లకు మేలు చేసేదే. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని విడుదల చేశారు.

వాస్తవానికి భీష్మ ఫక్తు లవ్ స్టొరీ అనే అభిప్రాయం యూత్ లో ఉంది. కాని దానికి భిన్నమైన కంటెంట్ ఇందులో ఉందనే స్పష్టమైన క్లూస్ ట్రైలర్ లో ఇచ్చేశారు. ఏ అమ్మాయిని ట్రై చేసినా నో చెప్పించుకునే ఓ యువకుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తులు తయారు చేసే ఓ కంపనీ, దానికి సవాల్ విసిరి స్వలాభం చూసుకుంటూ పొలాల్లో విషాన్ని నింపాలనుకునే ఓ దుర్మార్గుడు వీటి మధ్య జరిగే కథే ఈ భీష్మ. రష్మిక మందన్న రూపంలో ఓ లవ్ స్టొరీ ఉన్నప్పటికీ సీరియస్ ఇష్యూ మీదే భీష్మ పోరాటం కనిపిస్తోంది. 

మాస్ కు కావాల్సిన ఫైట్లు, హీరో విలన్ల మధ్య ఛాలెంజులు వగైరా మసాలా కూడా పుష్కలంగా ఉన్నట్టు చూపించారు. సో నితిన్ ఈసారి కేవలం యూత్ ని మాత్రమే కాకుండా అన్ని వర్గాలను టార్గెట్ చేశాడు. ఛలో తరహాలో దర్శకుడు వెంకీ కుడుముల సింపుల్ కామెడీతో పాటు మంచి జోష్ ఇచ్చే మహతి స్వర సాగర్ సంగీతం కూడా బలంగా నిలుస్తోంది. మొత్తానికి నితిన్ కు గ్యాప్ ఎక్కువ వచ్చినా సరైన సినిమాతోనే వస్తున్నట్టు కనిపిస్తున్నాడు. అసలే ఎంత ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే అంతగా కొత్త సినిమాలు నిరాశపరుస్తున్నాయి. మరి ఈ భీష్మనైనా టికెట్ కౌంటర్ల దగ్గర నెలకొన్న స్తబ్దతను బద్దలు కొడతాడో లేదో చూడాలి

Watch Trailer Here @ bit.ly/2wry0zr

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş