iDreamPost
android-app
ios-app

పూజాహెగ్డే టీం ఫుడ్ బిల్లే లక్షల్లో.. కట్టమని చెప్పేసిన నిర్మాతలు.. షాక్ లో పూజా..

  • Published Jun 22, 2022 | 7:16 AM Updated Updated Jun 22, 2022 | 7:16 AM
పూజాహెగ్డే టీం ఫుడ్ బిల్లే లక్షల్లో.. కట్టమని చెప్పేసిన నిర్మాతలు.. షాక్ లో పూజా..

కొంతమంది హీరోయిన్స్ నిర్మాతలకి భారంగా మారుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడినుంచో రావడానికి, వెళ్ళడానికి ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేయాలి, ఇక్కడ ఉండటానికి రూమ్స్, తినడానికి ఫుడ్ ఇవన్నీ నిర్మాతలే చూసుకోవాలి. కొంతమంది వీటిని మించి అడుగుతుండటంతో నిర్మాతలకి హీరోయిన్స్ ని భరించడం కష్టంగా మారిపోతుంది. ఇక కొంతమందికి అయితే వాళ్ళ అసిస్టెంట్స్, స్టాఫ్ కి కూడా నిర్మాతలే పెట్టుకోవాలి. అసిస్టెంట్, మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమ్ డిజైనర్.. ఇలా బడా హీరోయిన్స్ కి నలుగురైదుగురు అసిస్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చూసుకోవడం నిర్మాతకి అదనపు భారం.

ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే నిర్మాతలకి భారంగా మారిందని గతంలోనే వార్తలు వచ్చాయి. పూజా ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్.. వరుస ఫ్లాప్స్ లో ఉన్నా తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఓ దర్శకుడైతే ఆమెని హీరోయిన్ గా తీసుకుంటే నిర్మాతలకి మోపెడు ఖర్చు అవుతుందని గతంలోనే చెప్పేసాడు. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇందుకు నిదర్శమని తెలుస్తుంది.

బీస్ట్ మూవీ సమయంలో పూజాహెగ్డే స్టాఫ్‌కు సంబందించిన ఖర్చులు ఇటీవల నిర్మాతకి పంపించిందట. కేవలం వీరి ఫుడ్‌ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. ఆ బిల్లులు చూసిన నిర్మాత ఒక్కసారిగా కంగుతిన్నారని సమాచారం. పూజాహెగ్డే స్టాఫ్‌ ఫుడ్‌కు, మెయింటెన్స్‌కు అయిన బిల్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారట. అసలే బీస్ట్‌ మూవీ ఫ్లాప్ అయి నష్టాల్లో ఉన్న నిర్మాత ఈ బిల్లులు చూసి మరింత ఆందోళన చెంది నేను కట్టను, ఆమె స్టాఫ్ కి ఆమెనే ఇచ్చుకోమనండి అని గట్టిగానే చెప్పేశాడట.

ఇక సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో పూజా కూడా దీనిపై మాట్లాడకుండా ఆ బిల్లులను తనే కట్టుకుంటుందట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో కానీ హీరోయిన్స్ ని, వాళ్ళ స్టాఫ్ ని మెయింటైన్ చేయడం మాత్రం తలకి మించిన భారంగా మారింది నిర్మాతలకి. మరి దీనిపై పూజా హెగ్డే టీం స్పందిస్తుందేమో చూడాలి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet