iDreamPost
android-app
ios-app

బాబుగారి బంగారు బాతు

  • Published Oct 24, 2019 | 7:31 AM Updated Updated Oct 24, 2019 | 7:31 AM
బాబుగారి బంగారు బాతు

అనగనగా ఒక రాజు ,రాజుకు ఏడుగురు కొడుకులు.వాళ్ళు ఒకరోజు వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చారు . అందులో ఒకటి ఎండలేదు… ఈ కథ చిన్నప్పటి నుంచి విన్నదే… చేపా చేప నువ్వెందుకు ఎండలేదు అని అడిగితె ,నాకు ఎండ తగలకుండ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్ అడ్డం పెట్టారు అని చెప్పిందట.

బాబుకు కవచకుండలం మాదిరి కాపుకాసి.. ఆహా బాబు ఓహో బాబు ,బాబు లేకుంటే ఆంధ్రానే లేదు అని కీర్తనలు పాడిన RK గారికి టీడీపీ ఓటమి తరువాత కూడా ఓపిక సడలకపోగా రెట్టించిన కసితో లంగర్ వేసి బాబుగారికి తెరచాపలు ఎత్తుతున్నారు.

నాలుగు సంవత్సరాల కిందట అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు మట్టి నీళ్లు ఇచ్చి చెయ్యూపుకుంటు వెళ్లిన మోడిగారిని, నిధులు ఇవ్వమని అడగకుండ పుణ్య గంగా జలాలు అని రెండు చేతులతో అందుకున్న బాబుగారిని ఒక్కమాట కూడా ప్రశ్నించకుండా “మోడి వరాలు రాలకపోవటానికి కారణాలు ఇవేనా” టైటిల్ తో ,బీహార్ కంటే మెరుగైన ప్యాకేజి ఇచ్చేవారని అయితే ఇంకా అక్కడ ఎన్నికలు ముగియనందున ఆగాలసి వచ్చిందని, APకి ఇచ్చే వరాలపై “నీతి ఆయోగ్” ఇంకా నివేదికలు పూర్తిచేయలేదు, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనవుండగా APకి వరాలు ఇస్తే తమకేంటి అని KCR అడుగుతాడని — బీజేపీ నాయకులు ఆంధ్రజ్యోతి జర్నలిస్టులకు చెప్పారని ఆంధ్రజ్యోతి వార్త రాసింది

“అయినా పెద్దలు చెప్పినట్లు రాజుతలుచుకుంటే “వరాలకు” కొదవా?ఎవరికైయినా రాజకీయీయ లబ్దే ముఖ్యంరా .. బీహార్లో ప్యాకేజి ఇచ్చారు కదా?.. లాభమా?నష్టమా చూసుకుంటారు. లాభమయితే వెంటనే ఏపీ కి కూడా ప్రత్యేక ప్యాకేజి ఇస్తారు” అని రైతులు మాట్లాడుకోవటం ఆంద్రాజ్యోతి వాళ్ళు విన్నారంట.

నిధులు రాబట్టడంలో వైఫల్యం చెందిన బాబుగారిని ఇంత ఇదిగా వేనేసుకొచ్చిన ఆంధ్రజ్యోతి ఈ రోజు “బంగారు బాతును” చంపేశారన్న హెడ్డింగుతో అమరావతి మీద బాబుగారి ఆవు కథను ఏకరువు పెట్టారు. ఆ బంగారు బాతు గడచిన నాలుగు సంవత్సరాలలో పెట్టిన గుడ్లు ఎవరన్న చూశారా?బంగారు బాతు గుడ్లు ఎవరి కంటపడకుండా RK & బాబుగారు ఆమ్లెట్ వేసుకొని తిన్నారా?

ఆంధ్రజ్యోతి పద్దతి ఎలాఉంటుందంటే మనదంతా బంగారం, ఎదుటోళ్ళది కాకిబంగారం … గతంలో బాబుగారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మోడీ బాబుగారి కోసం ఎదురు చూశారు అన్న రేంజిలో వార్తలు రాసేవారు . నిన్న జగన్ హోమ్ మంత్రి అమిత్ షా గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి representation ఇస్తే “పూరి స్థాయిలో” appointment తీసుకోలేదని జగన్ గారు విజయ్ సాయి రెడ్డి గారు మరియు ప్రవీణ్ ప్రకాశ్ గారి మీద కోప్పడ్డారని “వైసీపీ నాయకులే” అనుకుంటున్నారని ఆంధ్రజ్యోతిలో వార్తా రాశారు.

ఈనాడు మాత్రం అమిత్ షాతో జగన్ 45 నిముషాలు సమావేశం అయినట్లు రాసింది. ఏది నిజం? ఏది అబద్దం ? అన్నది ఎవరికైనా సులభంగా అర్ధమవుతుంది. పుట్టినరోజు నాడు ఎన్ని గంటల appointment ఇస్తారు?దాదాపు అందరు మంత్రులు నిన్న అమిత్ షా ఇంటికే వెళ్లారు,రాధా కృష్ణగారికి మాత్రం విలోమంలోగా కనిపించాయి.

బాబుగారి బంగారు బాతును ఎవరుచంపుతారు కానీ అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు గుడ్లు పెట్టలేదో వరసపెట్టి రాయండి. రాజధాని “వ్యక్తిగత” ఆస్తి కాదు అది రాష్ట్రానికి రాజధానన్న సోయతో వార్తలు రాయండి.”బాబు కట్టిన అమరావతికి టికెట్ ఇవ్వండి ” అని ఒక ప్రయాణికుడు అడిగాడు అని రాసిన బాపతు వార్తలు కాకుండ కాస్త వార్తలలాంటి వార్తలు రాయండి.


jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetHoliganbet Giriş