iDreamPost
android-app
ios-app

అనారోగ్యం పై చింత లేదిక – విశ్రాంతి సమయంలో భత్యం

అనారోగ్యం పై చింత లేదిక – విశ్రాంతి సమయంలో భత్యం

పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య భరోసా కల్పనకు ధృడ సంకల్పంతో ఉన్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయించడమే కాకుండా, రోగి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఇంటి వద్ద కోలుకునే సమయంలో వేతన నష్టాన్ని భర్తీచేసేందుకు అందించే ఆర్థిక సాయానికి జగన్ సర్కార్ మార్గదర్శకాలు జారీచేసింది.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ 26 స్పెషాలిటీ వైద్య సేవలకు సంబంధించి 836 రకాల చికిత్సలకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుంది. అలాగే, ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అయ్యాక ఏ జబ్బుకు ఎన్ని రోజుల్లో కోలుకుంటారనేది మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ఈ ఆదేశాలు రేపటి (డిసెంబరు 1) నుంచి అమల్లోకి వస్తాయి.

ఇవి మార్గదర్శకాలు..

– డిశ్చార్జి అనంతరం ఆర్థిక సాయం కింద రోజుకు రూ.225లు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా గరిష్టంగా నెలకు రూ.5,000లు రికవరీ కాలానికి ఇస్తారు. 40 రోజులు ఆస్పత్రిలో ఉంటే 30 రోజులకు రూ.5వేలు, మిగతా పది రోజులకు రోజుకు రూ.225లు చొప్పున ఇస్తారు. మొత్తం 40 రోజులకు రూ.7,250లు ఇస్తారు.
– ఈ మొత్తం రోగి బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఒకవేళ రోగికి వ్యక్తిగత బ్యాంకు ఖాతా లేకపోతే రోగి కుటుంబ సభ్యుల్లో ఒకరి ఖాతాకు ఇవ్వవచ్చు.
– నెట్‌వర్క్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 48 గంటలలోపు రోగి బ్యాంకు ఖాతాకు ఈ మొత్తం జమ అవుతుంది. బ్యాంకు లావాదేవీలు వైఫల్యం చెందితే అవి విఫలమైన సమయం నుంచి 72 గంటలలోపు చెక్కు జారీచేస్తారు. ఆ చెక్కును సంబంధిత గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో పంపిణీ చేస్తారు.
– ఏదైనా ఫిర్యాదు ఉంటే రోగులు, వారి బంధువులు శస్త్ర చికిత్స చేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెందిన ఆరోగ్య మిత్రను లేదా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కార్యాలయ సమన్వయకర్తను సంప్రదించవచ్చు. లేదా సంబంధిత గ్రామ సచివాలయాలను సంప్రదించవచ్చు.
– ఒకే సంవత్సరంలో అదే సమస్య పునరావృతమైతే మొదటిసారి మాత్రమే భత్యం మంజూరు చేస్తారు.
– అలాగే, కేన్సర్‌ రోగులకు పలుమార్లు చికిత్స లేదా రేడియేషన్‌ అవసరమైనప్పటికీ వారికీ ఒకసారి మాత్రమే అందజేస్తారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetBetebetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş