iDreamPost
android-app
ios-app

అబద్దాల వల ఏప్రిల్ 1 విడుదల – Nostalgia

  • Published Apr 21, 2021 | 10:05 AM Updated Updated Apr 21, 2021 | 10:05 AM
అబద్దాల వల ఏప్రిల్ 1 విడుదల – Nostalgia

హాస్యానికి కమర్షియల్ సినిమా లాగా ఒక ప్రత్యేకమైన ఫార్ములా అంటూ ఏదీ ఉండదు. ప్రేక్షకులను మనసారా నవ్వించేందుకు ఏ కథైనా తీసుకోవచ్చు. కాకపోతే దాన్ని సమర్ధవంతంగా డీల్ చేయగల దర్శక రచయితలు, సాంకేతిక నిపుణులు, తారాగణం దొరకాలి. దానికి గొప్ప ఉదాహరణ ఏప్రిల్ 1 విడుదల. 1991 సంవత్సరం. దర్శకుడు వంశీ కసితో రగిలిపోతున్నారు. ఎంతో ఇష్టపడి తీసిన ‘స్వరకల్పన’ ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో గట్టిగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు కొలపల్లి ఈశ్వర్ రాసిన హారిశ్చంద్రుడు అబద్ధమాడితే నవల ఆధారంగా ఓ ఎంటర్ టైనర్ తీయాలన్న ఆలోచనకు బీజం పడింది. అనుకోవడం ఆలస్యం తన మిత్రుడు కృష్ణ భగవాన్ తో పాటు మాటల రచయిత కం నటులు ఎల్బి శ్రీరామ్ తో కలిసి స్క్రిప్ట్ కి రూపకల్పన చేశారు.

అప్పటికి వంశీ-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. ‘ప్రేమించి పెళ్లాడు’ యావరేజ్ కాగా, ‘లాయర్ సుహాసిని’ ఫ్లాప్ అయ్యింది. లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్ సూపర్ హిట్ అయ్యాయి. ఇది ఐదోది. కాలనీలో అబద్దాలు చెప్పుకుంటూ బ్రతికే దివాకరం(రాజేంద్ర ప్రసాద్) భువనేశ్వరి(శోభన)ని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కోసమే అందరినీ మాయ చేసి అప్పులు చేసి వీడియో షాప్ పెడతాడు. కానీ తనను పెళ్లి చేసుకోవాలంటే ఒక నెల పాటు నిజాలు చెప్పాలని కండీషన్ పెడుతుంది భువన. పరిణామాలు ఊహించని దివాకరం దానికి సంతోషంగా ఒప్పుకుంటాడు. కానీ ఇది కాస్తా చావుమీదకు తెస్తుంది. ఆ తర్వాత ఇతను తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు, ఏప్రిల్ 1 ఎలా విడుదల అయ్యాడు అనేదే కథ.

ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత కానీ అసభ్యత కానీ మచ్చుకు కూడా ఉండవు. ఆరోగ్యకరమైన హాస్యంతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా వంశీ చేసిన మేజిక్ అద్భుతంగా పని చేసింది. దానికి తోడు ఇళయరాజా అమోఘమైన పాటలు ఆడియన్స్ ని రంజింపజేశాయి. ఇప్పటికీ సాక్షి రంగారావు ఇంట్లో టీవీ పేలడం, దివాకరం నిజాలు చెప్పినప్పుడు జరిగే సన్నివేశాలు ఒకదాన్ని మించి మరొకటి పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. మల్లికార్జునరావు, జయలలిత, రాళ్ళపల్లి, కళ్ళు చిదంబరం, వై విజయ ఒకరా ఇద్దరా అందరూ పోటీ పడి జీవించారు. షూటింగ్ మొత్తం రాజమండ్రి రైల్వే కాలనీలో చేశారు. 1991 ఫిబ్రవరి 1న ఏప్రిల్ 1 విడుదల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు తక్కువ గ్యాప్ తో జనవరిలో వచ్చిన శత్రువు, సీతారామయ్య గారి మనవరాలు, ప్రేమఖైదీ, ఎర్రమందారం సూపర్ హిట్లను తట్టుకుని మరీ గొప్ప విజయం అందుకుంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişJojobet Giriş