iDreamPost
android-app
ios-app

సర్వే రిపోర్ట్ – కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో రెండవ స్థానంలో ఏపీ

  • Published Jan 16, 2021 | 9:08 AM Updated Updated Jan 16, 2021 | 9:08 AM
సర్వే రిపోర్ట్ – కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో రెండవ స్థానంలో ఏపీ

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన రోజు నుంచి రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ది బాటలో ప్రయాణించేలా తీవ్ర కృషి చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలన మూలంగా అస్తవ్యస్థంగా మారిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని సరిదిద్దుతూనే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచారు. కరోనా లాంటి అనుకోని విపత్తు ఎదురైనా సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయని జగన్ , రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విషయంలో కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలకన్న ముందు వరసలో ఉన్నట్టు సర్వే రిపోర్టు ఒకటి వెలువడింది.

కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా వేగంగా ముందుకు వెళ్తున్నట్టు ప్రాజెక్ట్ టుడే సంస్థ తాజాగా ప్రకటించిన 81వ నివేదికలో వెళ్ళడించింది. రాష్ట్రంలో ఒక పక్క ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం పెట్టుబడుల రూపంలో తిరోగమనంలో ఉందంటూ తీవ్రంగా ప్రచారం చేస్తున్న సమయంలోనే అవేవి వాస్థవం కాదని, ఒట్టి రాజకీయ విమర్శలు మాత్రమే అని ఈ నివేదిక ద్వార తేటతెల్లం అయ్యింది. వివరాల్లోకి వెలితే, ప్రాజక్ట్ టుడే సంస్థ దేశంలో కొత్తగా ప్రకటించిన పెట్టుబడులు, పిలిచిన టెండర్లు ఆదారంగా ప్రతీ మూడు నెలలకు ఒక సారి నివేదికను రూపొందిస్తుంది. అందులో భాగంగా వెళ్ళడించిన తాజా సర్వేలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచినట్టు పేర్కోంది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఏపీ రాష్ట్రంలో కొత్తగా 29,784 కోట్లు విలువైన పెట్టుబడులు పెట్టడానికి 108 ప్రతిపాధనలు వచ్చినట్టు ప్రాజెక్ట్ టుడే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది . రాష్ట్రానికి వచ్చిన మొత్తం ప్రాజెక్టుల విలువలో మూడో వంతు కేవలం సాగునీటి రంగానికి చెందిన ఐదు ప్రాజెక్టులు ఉన్నట్టు పేర్కొంది . ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 2,76,483 కోట్లు విలువైన పెట్టుబడుల ప్రకటన వెలువడితే అందులో 10.77 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచినట్టు ప్రజెక్ట్ టుడే పేర్కొంది .

మొత్తం 54,714 కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలవగా, 26,530 కోట్లతో గుజరాత్ మూడవ స్థానంలో , 24,124 కోట్లతో తమిళనాడు నాలుగో స్థానంలో , 20,217 కోట్లతో ఒరిస్సా 5వ స్థానంలో నిలిచినట్టు నివేదికలో పేర్కోంది. ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 12,961 కోట్లతో 8వ స్థానంలో ఉండటం గమనార్హం.

నిన్నటి రోజున సీ ఓటర్ సంస్థ విడుదల చేసిన అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో దేశంలోనే 3వ స్థానాన్ని కైవసం చేసుకున్న సీఎం జగన్ నేడు పెట్టుబడుల ఆకర్షణలో ప్రాజెక్ట్ టుడే సంస్థ విడుదల చేసిన నివేదికలో దేశంలో రెండవ స్థానాన్ని సాధించడం జగన్ పాలనా దక్షతకు నిదర్శనం అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişjojobet girişcasibomcasibom