iDreamPost
android-app
ios-app

పంచాయతీ ఎన్నికలు.. రీషెడ్యూల్‌ చేసిన నిమ్మగడ్డ

పంచాయతీ ఎన్నికలు.. రీషెడ్యూల్‌ చేసిన నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు సుప్రిం కోర్టులో లైన్‌ క్లియర్‌ కావడంతో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సిద్ధం కానందున రీషెడ్యూల్‌ జారీ చేశారు. మొదటి దశను నాలుగో దశగా మార్చారు. రెండో దశను మొదటి దశగా, మూడో దశను రెండో దశగా, నాలుగో దశను మూడో దశగా, ఒకటో దశను నాలుగో దశగా మారుస్తూ రీ షెడ్యూల్‌ విడుదల చేశారు. వచ్చే నెల 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి దశకు ఈ నెల 29వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించేలా రీ షెడ్యూల్‌ రూపాందించారు.

ఇదీ రీ షెడ్యూల్‌..

రీ షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 27వ తేదీన తొలి దశకు నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 2వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 3వ తేదీన అభ్యంతరాల పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. 4వ తేదీ సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఇస్తారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 9వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఆ వెంటనే లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాలు వెల్లడైన వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis