iDreamPost
android-app
ios-app

మూడో కన్నుతో మూకుతాడు

మూడో కన్నుతో మూకుతాడు

సున్నితమైన అంశాలపై ప్రజలకు, రాజకీయ పార్టీలకు స్వియ నియంత్రణ అవసరం. అయితే రాజకీయ పార్టీలు ఆయా అంశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకుంటనే సమస్యలు మొదలవుతాయి. ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను తమ ఎదుగుదల కోసం వాడుకోవాలనుకునే రాజకీయ నేతలు, పార్టీల వల్ల సమాజానికి నష్టం తప్పా మేలు జరగదన్నది అందరూ చెప్పే మాట. అయినా రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసమే ప్రాకులాడుతుంటే.. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడం మినహా వారిని ఆపలేవు.

మునుపెన్నడూ లేని విధంగా ఏపీలో దేవుడు, దేవాలయాలను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలోనూ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలలో ప్రమాదాలు, ఊహించని సంఘటనలు జరిగాయి. అయితే రాజకీయ పార్టీలు స్వియ నియంత్రణ పాటించడంతో అవి వివాదాస్పదం కాలేదని చరిత్ర చెబుతోంది. చంద్రబాబు హాయంలో విజయవాడ నగరంలో ప్రభుత్వమే దాదాపు 40 దేవాలయాలను కూల్చి, విగ్రహాలను పక్కపడేసినా రాజకీయ పార్టీలు దేవుడితో రాజకీయం చేయలేదు. బాబు ప్రభుత్వ తీరును ఎండగట్టాయి కానీ ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు.

కానీ ఏపీలో ప్రస్తుతం పరిస్థితి గతానికి అందుకు భిన్నంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న జగన్‌ సర్కార్‌ను ఇరుకునపెట్టాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలు పని చేస్తున్నాయన్న వ్యాఖ్యలు వారి ప్రకటనల ద్వారా స్పష్టమవుతోంది. ఘటన ఏ విధంగా జరిగినా ప్రభుత్వాన్నే ప్రతిపక్ష పార్టీలు లక్ష్యంగా చేసుకుంటుండడంతో.. ఇకపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద విద్యుత్‌ ధీపాలు స్పష్టంగా వెలిగేలా, ఆ ప్రాంగాణాల్లో కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్య ద్వారా ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేసే వారికి మూకుతాడు పడే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş