iDreamPost
android-app
ios-app

ఏపీ లో కొత్తగా 10044 కాల్‌సెంటర్‌

  • Published Nov 24, 2019 | 4:23 PM Updated Updated Nov 24, 2019 | 4:23 PM
ఏపీ లో కొత్తగా 10044 కాల్‌సెంటర్‌

అవినీతి చేస్తే ఇంటికే, ఏపీ లో కొత్తగా 10044 కాల్‌సెంటర్‌ రేపటి నుంచి ప్రారంభం

రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు మరో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు.ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వద్ద 1064 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ ఉండగా అవినీతి పై రోజుకు ఫిర్యాదులు ఎక్కువ గా వస్తుండడంతో అదనంగా మరో టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.1064 కాల్ సెంటర్ కొన్నేళ్లుగా పనిచేస్తోంది. దీనికి అదనంగా చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయం లో ఏర్పాటు చేసిన1100 కాల్‌సెంటర్‌కూ అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా వైఎస్ జగన్‌ ప్రభుత్వం మరోకాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి కొత్తగా 10044 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించారు.

సోమవారం ఉదయం సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పౌరసేవల్లో అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ విశేషంగా కృషిచేస్తోంది. 1064 అనే టోల్‌ఫ్రీ నంబరుతోపాటు 8333995858 అనే నంబరుకు వాట్సప్‌ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1100 కాల్‌సెంటర్‌కూ అవినీతిపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదిలావుండగా, అవినీతిపై యుద్ధం అంటున్న జగన్‌ ప్రభుత్వం కొత్తగా 10044 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకొస్తోంది.
ఫిర్యాదులు స్వయంగా ఇంటలిజెన్స్, ఐఏస్, ఏసీబీ అధికారి పర్యవేక్షణలో కొనసాగుతోంది.అవినీతిపై ఫిర్యాదులు రుజువు ఐతే ఇంకా ఇంటికే…ఇదిలా ఉండగా ప్రభుత్వ అధికారుల అవినీతి నీ పక్కన పెడితే రాజకీయ నాయకులు పాల్పడితే కటినంగా పనిష్ చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş