iDreamPost
android-app
ios-app

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఎజెండా

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఎజెండా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఇప్పటికే ‘వైఎస్‌ఆర్‌ నవశకం’ పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు మరింతమందికి లబ్ధి చేకూర్చేందుకు కొత్తగా రూపొందించిన అర్హత మార్గదర్శకాలకు బుధవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలు చర్చించనున్నారు.

1. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15వేలు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు, డిగ్రీ ఆపేజ్ కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్‌ ఫీజులు ఏటా రూ.20వేల చొప్పున ఇచ్చే ‘జగనన్న వసతి’కి సంబంధించి ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు.

2. టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య పెంచుతూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ కు కేబినెట్‌లో ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లులో సవరణలు చేయనున్నారు.

3. పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్‌) విధానంలో ఏర్పాటుచేసిన పోర్టులకు సంబంధించి ఆడిట్‌ కోసం సంస్థలను ఎంపికచేస్తూ కేబినెట్‌ లో నిర్ణయం తీసుకోనున్నారు.

4. సీఆర్‌డీఏకి సంబంధించి ఏ ప్రాజెక్టులు చేపట్టాలి.. వేటిని చేపట్టకూడదనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

5. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş