iDreamPost
android-app
ios-app

మీ కోసం మళ్ళీ వస్తున్నా.. ఉదయభాను ఇలా ఎంట్రీ ఇస్తుంది..

  • Published Jun 06, 2022 | 6:51 PM Updated Updated Jun 06, 2022 | 6:51 PM
మీ కోసం మళ్ళీ వస్తున్నా.. ఉదయభాను ఇలా ఎంట్రీ ఇస్తుంది..

ఒకప్పుడు సుమకి పోటీగా చాలా ప్రోగ్రామ్స్ లో చేసిన యాంకర్ ఎవరైనా ఉంది అంటే ఉదయభాను ఒక్కరే. తెలుగు అమ్మాయిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు టీవీ షోలలో తన యాంకరింగ్ తో అందర్నీ మెప్పించింది. టీవీ షోలు, కొన్ని సినిమాలు, ఈవెంట్స్, సినిమా ఫంక్షన్స్ ఇలా ప్రతిదానిలోనూ కనిపించి ఉదయభాను ఒకప్పుడు ఒక ఊపు ఊపేసింది తెలుగు బుల్లితెరని. టాప్ యాంకర్ గా కొన్నేళ్లు రూల్ చేసింది.


తర్వాత పెళ్లి చేసుకొని టీవీ పరిశ్రమకి పూర్తిగా దూరమైంది. ఆ తర్వాత తనకి కవల పిల్లలు కూడా పుట్టారు. ఇటీవల చాలా సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల క్రితం కొన్ని షోలలో కనిపించి మెప్పించినా అవి అంతగా క్లిక్ అవ్వలేదు. తాజాగా తాను అభిమానుల కోసం, ప్రేక్షకులకి మరింత దగ్గరవడానికి యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టింది. ఇటీవల సెలబ్రిటీలు అంతా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. దీంతో ఉదయభాను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.


అయితే అందరికంటే వినూత్నంగా తన మొదటి వీడియోని పోస్ట్ చేసింది ఉదయభాను. ఒక స్పెషల్ ప్రోమోని షూట్ చేసి ‘మీ ప్రేమే నా బలం’ అనే పేరుతో అభిమానులని ఉద్దేశించి తన మొదటి వీడియోని షేర్ చేసింది పేరుతో మొట్టమొదటి వీడియోను వదిలింది. ఈ వీడియోలో చీరల్లో హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాల్లో కొన్ని స్పెషల్ షాట్స్ తీసుకొని దానికి తన వాయిస్ తో ఓ వాయిస్ ఓవర్ ఇచ్చింది.

ఈ వీడియోలో.. ”మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం, నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నా ధైర్యమై నిలిచింది మీరే. ఒక సాధారణమైన ఆడపిల్లగా అడుగు ముందుకి వేద్దామంటే ముళ్ళు పరిచేవారే కానీ, దారి చూపే వారు అరుదు. కనిపించని యుద్దాలు ఎన్నో, జడిపించిన భయాలెన్నో, పడగొట్టే ప్రయత్నాలెన్నో అయినా అలుపెరగని కెరటంలా నిరంతరం చెరగని చిరునవ్వు, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం నా వెన్నంటే ఉండటానికి అసలు కారణం మీ అభిమానం అనే ఆయుధం. మీ ప్రేమే నా ధైర్యం. మీ అభిమానంతో నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం తప్ప అందుకే వస్తున్నా మీ ఉదయభాను” అంటూ వాయిస్ ఇచ్చింది. దీంతో మొదటి వీడియోనే అందరి కంటే వినూత్నంగా చేసింది అంటే రాబోయే వీడియోలు కూడా కచ్చితంగా అలరిస్తాయి అని అంటున్నారు. ఇక ఉదయభాను ఫ్యాన్స్ ఈ విధంగా మళ్ళీ అలరించేందుకు వస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş