iDreamPost
android-app
ios-app

మహా దర్శకుడితో అఖిల్ ?

  • Published Apr 19, 2021 | 5:20 AM Updated Updated Apr 19, 2021 | 5:20 AM
మహా దర్శకుడితో అఖిల్ ?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కోసం వెయిట్ చేస్తూ ఇటీవలే ఏజెంట్ మొదలుపెట్టిన అక్కినేని అఖిల్ ప్రాజెక్ట్స్ ని ఓకే చేయడంలో వేగం పెంచాడు. లేటెస్ట్ గా మైత్రి సంస్థ కోసం ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం అజయ్ మహా సముద్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ విడుదల లాక్ చేశారు కాబట్టి వీలైనంత వేగంగా అన్నీ పూర్తి చేసి జూలైకంతా ఫస్ట్ కాపీ రెడీ చేసేందుకు పక్క ప్లానింగ్ తో సాగుతున్నాడు. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ లో ఉన్న మహా క్యారెక్టర్ ని అదితి రావు హైదరి చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు బయటికి వచ్చాయి.

ఇప్పుడు అఖిల్ తో ఓకే అయ్యింది అఫీషియల్ గా బయటికి రాలేదు కాబట్టి ఖరారుగా చెప్పలేం కానీ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏజెంట్ ని ఆల్రెడీ డిసెంబర్ విడుదలకి లాక్ చేశారు. సో నవంబర్ లోగా అఖిల్ ఫ్రీ అవుతాడు. అప్పటికంతా మహాసముద్రం థియేట్రికల్ రిలీజ్ కూడా పూర్తయ్యి ఉంటుంది కాబట్టి ఈ కాంబో సెట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అజయ్ భూపతి తన మూడో సినిమాగా భవ్య క్రియేషన్స్ తో చేయొచ్చని న్యూస్ గతంలో బయటికి వచ్చి కానీ ఆ నిర్మాత ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఇది ఆలస్యం లేదా పూర్తిగా రద్దయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

ఇక ఆరేళ్ళలో కేవలం మూడు సినిమాలు అందులోనూ లవ్ స్టోరీలు చేసి దెబ్బ తిన్న అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిజల్ట్ ఎలా వచ్చినా అభిమానుల దృష్టి మాత్రం ఏజెంట్ మీదే ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి తమ హీరోకు మంచి మాస్ ఇమేజ్ వచ్చే టేకింగ్ తో మెప్పిస్తాడని నమ్మకంతో ఉన్నారు. అఖిల్ కోరుకుంటున్నది కూడా ఇదే. బ్యాచిలర్ విడుదలను గతంలో జూన్ 19 ఫిక్స్ చేశారు కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇంకా ముందే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రమోషన్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ అండగా ఉన్నప్పటికీ ఎందుకో ఆ స్థాయి బజ్ అయితే ఇంకా ఏర్పడలేదు

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş