iDreamPost
android-app
ios-app

Akhil Akkineni : సోషల్ మీడియా పవర్ చూపించిన ‘అయ్యగారు’

  • Published Oct 19, 2021 | 10:03 AM Updated Updated Oct 19, 2021 | 10:03 AM
Akhil Akkineni : సోషల్ మీడియా పవర్ చూపించిన ‘అయ్యగారు’

కెరీర్ మొదలుపెట్టి అయిదేళ్ళు అవుతున్నా సరైన హిట్ లేదని తపించిపోతున్న అఖిల్ కు ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో ఊరట దక్కింది. దసరా పండగ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్న ఈ ఎంటర్ టైనర్ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఉంది. లవ్ స్టోరీ తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు వచ్చింది దీనికే. బొమ్మరిల్లు రేంజ్ కాకపోయినా దర్శకుడు భాస్కర్ దీన్ని తీర్చిదిద్దిన తీరు జనానికి బాగానే రీచ్ అయ్యింది. డిజాస్టర్ అని క్రిటిక్స్ తీర్పిచ్చిన పెళ్లి సందడి సైతం పెట్టుబడి వెనక్కు తెస్తోందంటే ఈ సారి పండగ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే రివ్యూలు మిక్స్డ్ గా వచ్చినా బ్యాచిలర్ లాభాలు ఇచ్చాడు.

ఇక ఈ సందర్భంగానే అఖిల్ కం అక్కినేని వీరాభిమాని అయిన గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు మరింత పాపులర్ అయ్యాడు. అఖిల్ మొదటి సినిమా రిలీజ్ టైంలో అయ్యగారే నెంబర్ వన్ అని ఇతను కేకలు పెడుతున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీని మీద లక్షల్లో మీమ్స్ వచ్చాయి. హలో, మిస్టర్ మజ్ను విడుదలప్పుడు కూడా వీటినే వాడుకున్నారు. అతను ఎలా అరిచినా కూడా గొంతులో అభిమానం, మాటల్లో నిజాయితి కనిపించింది. అందుకే అంతగా చేరిపోయాడు. మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సందర్భంగా కటవుట్ కి టెంకాయ కొట్టి హంగామా చేస్తున్న వీడియో పాపులర్ అయ్యింది.

ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ అయ్యగారు అనే మాటని సినిమా క్లైమాక్స్ లో భాస్కర్ చేర్చే దాకా. అందుకే అతనికి ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ నిన్న అఖిల్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో సంభాషిస్తూ చెప్పడం ఫేస్ బుక్, ఇన్స్ టాలో బాగా తిరుగుతోంది. ఇవాళ అల్లు అర్జున్ అతిథిగా జరగబోయే ఈవెంట్ కి ఇతన్ని తీసుకురాబోతున్నారట. అఖిల్ స్వయంగా హగ్ చేసుకుని మరీ ఫోటో ఇస్తాడని తెలిసింది. అప్పుడు అతగాడి పేరు ఇతర వివరాలు తెలుస్తాయి. మొత్తానికి సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటి ఫ్యాన్స్ తమ హీరోల కోసం ఎంతగా తపించిపోతున్నారో స్టార్లకు ప్రత్యక్షంగా తెలిసి వస్తోందని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ కావాలా

Also Read : Mahesh Babu In EMK : మహేష్ బాబుతో ముగింపు పలుకుతారా

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş