iDreamPost
android-app
ios-app

నటీమణుల అందం వెనకున్న సీక్రెట్ చెప్పేసిన ఈషా గుప్తా

  • Published Jun 10, 2022 | 10:39 AM Updated Updated Jun 10, 2022 | 10:39 AM
నటీమణుల అందం వెనకున్న సీక్రెట్ చెప్పేసిన ఈషా గుప్తా

ఈషా గుప్తా. ఈ నటి గుర్తుంది కదూ. జన్నత్ 2 సినిమాతో వెండితెరకు పరిచయమై.. ఈ మధ్యకాలంలో ఆశ్రమ్ 3 సిరీస్ లో కనిపించింది. వెండితెరపై చివరగా 2019లో వచ్చిన టోటల్‌ ఢమాల్‌, వన్‌ డే జస్టిస్‌ డెలివర్‌డ్‌ చిత్రాల్లో మెరిసింది. తాజాగా ఈషా గుప్తా.. సినీ కెరీర్ పరంగా ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తనను ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారని, వెక్కిరించారని చెప్పుకొచ్చింది.

“నా ముక్కు గుండ్రంగా ఉందని, దాన్ని షార్ప్‌గా కనిపించేలా చేసుకోమన్నారు. కొన్నాళ్లకు నా స్కిన్ మెరిసిపోయేందుకు ఇంజక్షన్ తీసుకోమన్నారు. దాని గురించి ఆరా తీస్తే ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.9000 ఉంటుందని తెలిసింది. ఆ ఇంజక్షన్ పేరు చెప్పలేను కానీ.. చాలామంది నటీమణులు మెరిసే చర్మం కోసం ఈ ఇంజక్షన్ ను తీసుకుంటున్నారు.” అని ఈషా గుప్తా తెలిపింది.

సినీ ఇండస్ట్రీలో ఉండే తారలపై అందంగా కనిపించాలని చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే నా కూతుర్ని మాత్రం నటిగా చూడాలనుకోవడం లేదని పేర్కొంది ఈషా. చిన్న వయసు నుంచే అందంగా కనిపించాలన్న తాపత్రయం తను ఒత్తిడికి గురికావడం తనకెంతమాత్రం ఇష్టం లేదని, కూతురు పెద్దగా చదువుకోకపోయినా పర్లేదు కానీ.. గొప్ప క్రీడాకారిణిగా చూడాలనుకుంటున్నానని ఈషా చెప్పింది.

 

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet