iDreamPost
android-app
ios-app

చివరికి రైతు సంక్షేమం పైనా విషం కక్కుతున్న ఏబీఎన్ ..

  • Published Jan 04, 2022 | 10:25 AM Updated Updated Jan 04, 2022 | 10:25 AM
చివరికి రైతు సంక్షేమం పైనా విషం కక్కుతున్న ఏబీఎన్ ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందులో లోపాలు ఉన్నా లేకపోయినా ఏదో ఒక నెపం వేస్తూ కాదేదీ దుష్ప్రచారానికనర్హం అన్న తీరున విషపు రాతలు రాసుకొంటూ పోతుంది ఆంధ్రజ్యోతి పత్రిక . ఈ క్రమంలో తాను రాసిందే సత్యం , తాను చెప్పిందే వేదం అనుకొంటూ వాస్తవాలను విస్మరిస్తూ , ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నవ్వుల పాలవుతున్నా గుర్తించకుండా తన ధోరణిలో తాను సాగిపోతుంది . ఈ క్రమంలో నేడు మరో దుష్ప్రచారానికి తెర తీసింది .

నిన్న వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా క్రింద జమ చేసిన డబ్బులు కేంద్రానివి కాగా ఆ విషయాన్ని మరుగు పరిచిన ప్రభుత్వం తామే ఇస్తున్నామని ప్రచారం చేసుకున్నారని వైసీపీ మేనిఫెస్టోలో 12500 చొప్పున ఇస్తామన్నారని అందులో 6000 కేంద్రానివేనని ఈ లెక్కన వైసీపీ కేంద్ర నిధులు పంచుతూ వాటికి అనవసర ఆర్భాటాలతో ప్రచారానికి ఖర్చు చేస్తూ దొంగ మీటలు నొక్కుతున్నారు అంటూ ఓ కథనం ప్రచురించింది .

నిజానికి పీఎం కిసాన్ యోజన ప్రకటించటానికి ముందు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుండి ప్రతి ఏటా రూ 12500 చొప్పున ఐదేళ్ల అధికార కాలంలో 50000 రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పొందు పరిచారు . అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్ యోజన పథకం క్రింద ఏటా ఆరు వేల చొప్పున మూడు విడతలుగా సాయం అందించాలని నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం పై కొంత ఆర్థికభారం తగ్గే వెసులుబాటు లభించింది .

Also Read : జగన్‌కు ప్రజలే ప్రాధాన్యత .. ఇదిగో నిదర్శనం..

కానీ రైతులకు చేస్తామన్న సాయం అందించాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి జగన్ ముందు చెప్పిన 12500 కాకుండా మరో వెయ్యి రూపాయలు కలుపుతూ కేంద్రం నుండి వచ్చిన ఆర్థిక వెసులుబాటు మేరకు రైతులకు ఇస్తానన్న నాలుగేళ్లు కాకుండా ఐదేళ్లపాటు 13500 చొప్పున రైతులకు ఇవ్వటానికి నిశ్చయించుకొన్నారు .

అంతే కాక రైతు భరోసా పథకానికి కిసాన్ యోజన పేరును కూడా చేరుస్తూ వైఎస్సార్ రైతు భరోసా pm kisan అని పేరుతో వ్యవహరిస్తూ ప్రభుత్వ ప్రకటనల్లో కూడా కేంద్ర పథకాన్ని ఉదహరిస్తూ వస్తున్నారు . మొత్తం పథకంలో ఐదేళ్లలో కేంద్ర నిధులు రైతుకు 30000 చొప్పున వస్తుండగా ఆ మేరకు జగన్ పెంచిన భరోసా ప్రకారం రాష్ట్రం వాటిలో 17500 తిరిగి రైతులకే పంచుతుంది . అంటే కేంద్రం ఇచ్చిన వెసులుబాటు 30000 లో రాష్ట్రం వద్ద పన్నెండు వేలు మాత్రమే మిగులుతున్నాయి .

అయితే కేంద్ర పథకం పరిధిలోకి రాని కౌలు , అటవీ భూమి , దేవాదాయ భూమి సాగు రైతులు లక్షన్నర మందికి రైతు భరోసా 30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది . అలాగే నిన్న జరిగిన పంపిణీలో కొత్తగా నమోదైన 21140 మంది రైతులకు ఏడాదిలో ఇచ్చే మూడు విడతల భరోసా కలిపి ఒకేసారి 13500 చొప్పున 28.53 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే జమ చేసింది . ఈ రెండు వర్గాల వారికి కూడా నిన్న జమ చేసిన ప్రభుత్వం సదరు వివరాలతో ఇచ్చిన ప్రకటనను కూడా ఆర్భాటంగా చేసిన ప్రచారంగా ఏదో పెద్ద సభ జరిపి చేసిన ఆర్థిక దుర్వినియోగంగా చెబుతూ తన పత్రికలో ఆ ప్రకటన కన్నా పెద్ద హెడ్డింగ్స్ తో దుష్ప్రచారానికి తెరలేపింది ఆంధ్రజ్యోతి .

Also Read : దుర్గి ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ రాజకీయాల వెనుక అసలు లక్ష్యాలేంటి