iDreamPost
android-app
ios-app

నిశ్చితార్థమైన యువతిని.. వీడియోలతో బెదిరించి..

  • Published Jun 09, 2022 | 10:41 AM Updated Updated Jun 09, 2022 | 10:54 AM
నిశ్చితార్థమైన యువతిని.. వీడియోలతో బెదిరించి..

ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేశాడు. దాంతో బాధిత యువతి తిరుమలగిరి పోలీసులను ఆశ్రయించింది. తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తుంది. 2017లో ఆమెకు అత్తాపూర్ కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన దూరపు బంధువైన నిహాల్ సింగ్ తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది.

2021 జులై1వ తేదీన యువతి అత్తాపూర్ కు వెళ్లగా.. నిహాల్ సింగ్ ఆమెను టెర్రస్ పై ఉన్న గదికి రప్పించి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత పలుమార్లు లాడ్జిలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతేడాది డిసెంబర్ లో బాధిత యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. నిశ్చితార్థమైనా నిన్నే పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు నిహాల్. ఈ ఏడాది ఫిబ్రవరిలో యువతికి మరొక వ్యక్తితో నిశ్చితార్థమైంది.

తనకు పెళ్లి నిశ్చయమైందని, తనను వదిలేయాలని యువతి నిహాల్ ను వేడుకుంది. అప్పుడే అతడి అసలు రంగు బయటపడింది. తన కోరిక తీర్చకపోతే.. తనతో కలిసున్నపుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కాబోయే భర్తకు కూడా పంపుతానని బెదిరించి, పలుమార్లు అత్యాచారం చేశారు. నిహాల్ సూచన మేరకు యువతి పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంది. కాగా.. ఇటీవల యువతి గర్భవతి కావడంతో.. విషయం నిహాల్ కు చెప్పి, తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఒత్తిడి చేసింది. ఈనెల 6న తల్లితో సహా తిరుమలగిరికి వచ్చిన నిహాల్‌ సింగ్‌ ఆమెను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో బాధితురాలు జూన్ 7వ తేదీన తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap