iDreamPost
android-app
ios-app

జార్ఖండ్ లో మరో మైనర్ పై దారుణం.. నిందితులు సజీవదహనం

  • Published Jun 10, 2022 | 9:20 AM Updated Updated Jun 10, 2022 | 9:20 AM
జార్ఖండ్ లో మరో మైనర్ పై దారుణం.. నిందితులు సజీవదహనం

యువతులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల కాలంల హైదరాబాద్ మహానగరంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడం.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రకలకలం రేపాయి. తాజాగా.. జార్ఖండ్ లో మరో ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడటంతో.. ఆగ్రహించిన గ్రామస్తులు వారిని హతమార్చారు.

గుమ్లా జిల్లాలోని పొరుగు గ్రామంలో బాధిత బాలిక కుటుంబీకులు ఓ పెళ్లివేడుకకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు. అదే సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ లపై వస్తుండగా.. బాలిక తండ్రి తన కూతుర్ని జాగ్రత్తగా ఇంటివద్ద దింపాలని కోరాడు. బాలికను బైక్ ఎక్కించుకుని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇంటికివచ్చాక.. బాలిక జరిగిన విషయం చెప్పి బోరుమని ఏడ్చింది.

విషయం గ్రామపెద్దల దృష్టికి చేరింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఇద్దరు నిందితులను చితకబాదారు. వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించగా.. ఒక నిందితుడు అక్కడికక్కడే మరణించాడు. మరో నిందితుడు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

 

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetgalabetHoliganbet