iDreamPost

న్యూజిలాండ్ తరఫున సత్తా చాటుతున్న విజయవాడ కుర్రాడు.. సెంచరీతో చెలరేగి..

New Zealand Sensation Snehith Reddy: న్యూజిలాండ్ అండర్ 19 వరల్డ్ కప్ లో తెలుగు కుర్రాడి పేరు మారు మోగుతోంది.

New Zealand Sensation Snehith Reddy: న్యూజిలాండ్ అండర్ 19 వరల్డ్ కప్ లో తెలుగు కుర్రాడి పేరు మారు మోగుతోంది.

న్యూజిలాండ్ తరఫున సత్తా చాటుతున్న విజయవాడ కుర్రాడు.. సెంచరీతో చెలరేగి..

సౌత్ ఆఫ్రికా వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 84 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే కేవలం టీమిండియా మాత్రమే కాకుండా భారత సంతతి అయిన ఒక కుర్రాడి పేరు ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ లో వైరల్ అవుతోంది. అతను మరెవరో కాదు.. స్నేహిత్ రెడ్డి. విజయవాడకు చెందిన స్నేహిత్ రెడ్డి న్యూజిలాండ్ తరఫున అండర్ 19 క్రికెట్ లో అదరగొడుతున్నాడు. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లో శతకంతో చెలరేగాడు. ఈ నేపథ్యంలోనే ఈ స్నేహిత్ రెడ్డి ఎవరూ అంటూ వెతుకులాట మొదలు పెట్టేశాడు.

అండర్ 19 వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. మరోవైపు భారత సంతతికి చెందిన స్నేహిత్ రెడ్డి కూడా కివీస్ తరఫున అదరగొడుతున్నాడు. స్నేహిత్ రెడ్డి విజయవాడలోనే జన్మించాడు. అతను ఏపీలోనే పుట్టినా.. తల్లిదండ్రులు న్యూజిలాండ్ కు వలస వెళ్లారు. న్యూజిలాండ్ తరఫున అదరగొడుతున్న ఇండియన్స్ లిస్టులో ఇప్పుడు స్నేహిత్ రెడ్డి పేరు కూడా చేరింది. నేపాల్ తో జరిగిన తొలి మ్యాచ్ లో స్నేహిత్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ తో నిప్పులు చెరిగాడు. కేవలం 125 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు.

A boy from Vijayawada who is showing his strength for New Zealand

న్యూజిలాండ్ 64 తేడాతో ఘన విజయం నమోదు చేసిందంటే అందుకు ప్రధాన కారణం స్నేహిత్ రెడ్డి అనే చెప్పాలి. టీమ్ మొత్తం చేసిన స్కోర్(138) కంటే.. స్నేహిత్ రెడ్డి చేసిన స్కోరే ఎక్కువ. తర్వాత న్యూజిలాండ్ జట్టు బౌలర్లు చెలరేగడంతో నేపాల్ ని 238 పరుగులకే కట్టడి చేయగలిగారు. మ్యాచ్ లో సెంచరీ తర్వాత స్నేహిత్ రెడ్డి శుభ్ మన్ గిల్ స్టైల్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. తన సెలబ్రేషన్ గురించి స్నేహిత్ రెడ్డి ముందే ఊహించాడట. గిల్ స్టైల్ అయితే బాగుంటుందని డిసైడ్ అయినట్లు చెప్పాడు. శతకం నమోదు చేసిన తర్వాత బ్యాటును గాల్లోకి లేపి.. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.

స్నేహిత్ రెడ్డి వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.. స్నేహిత్ రెడ్డి పుట్టింది విజయవాడలోనే అయినా అతని తల్లిదండ్రులు స్నేహిత్ చిన్నప్పుడే న్యూజిలాండ్ కు వలస వెళ్లారు. స్నేహిత్ విద్యాభ్యాసం, క్రికెట్ లో శిక్షణ అంతా అక్కడే జరిగింది. స్నేహిత్ రెడ్డి న్యూజిలాండ్ మాజీ ఆటగాల్లు అయిన బీజే వాట్లింగ్, క్రెయిగ్ కుగ్గెలిన్ వద్ద శిక్షణ పొందాడు. స్నేహిత్ అండర్- 15, అండర్- 17లో కూడా పరుగుల వరద పారించాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి పేరు న్యూజిలాండ్ క్రికెట్ లో సెన్సేషన్ గా మారింది. ఈ 17 ఏళ్ల స్నేహిత్ రెడ్డి మాత్రమే కాకుండా ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టులో భారత మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ బౌలింగ్ ఆల్రౌండర్ ఒలివర్ తెవాటియా. ఈ ఆటగాడు న్యూఢిల్లీలో పుట్టాడు. ప్రస్తుతం అండర్-19 న్యూజిలాండ్ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. మరి.. న్యూజిలాండ్ తరఫున చెలరేగుతున్న స్నేహిత్ రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి