iDreamPost

Bheemla Nayak & SVP : మహేష్ పవన్ సినిమాల కొత్త డేట్లు

Bheemla Nayak & SVP : మహేష్ పవన్ సినిమాల కొత్త డేట్లు

నాలుగైదు సినిమాలతో 2022 సంక్రాంతి మహా టఫ్ గా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ తో స్ట్రెయిట్ గా క్లాష్ చేయడం ఏమంత సేఫ్ కాదని చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. అందుకే ఇప్పుడు సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లు రేస్ నుంచి తప్పుకునే నిర్ణయం ఆల్మోస్ట్ తీసుకున్నాయని ఇన్ సైడ్ టాక్. డిస్ట్రిబ్యూటర్లు సైతం ఇలా ఢీ కొట్టడం వల్ల నిర్మాతల కంటే తమకే ఎక్కువ నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆల్మోస్ట్ షిఫ్ట్ చేసే దిశగా ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారట. ఇంకా ప్రకటన రాలేదు.

పైన చెప్పిన ప్రచారం ప్రకారం చూసుకుంటే భీమ్లా నాయక్ మార్చ్ 1 లేదా 31, సర్కారు వారి పాట ఏప్రిల్ 28కి రావొచ్చు. ఇవి సేఫ్ డేట్లు. ఫిబ్రవరి ఎలాగూ ఆచార్య, ఎఫ్3 లు లాక్ చేసుకున్నాయి. అందుకే ఇది ఉత్తమ మార్గం. ఎలా చూసుకున్నా మార్చ్ ఏప్రిల్ నెలలు మంచి సీజనే. గతంలో రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్లు వచ్చింది మార్చి లోనే. బాహుబలి రికార్డులు అందుకుంది ఏప్రిల్ లో. సో పవన్ మహేష్ రేంజ్ అల్టిమేట్ స్టార్ డం ఉన్న హీరోలకు ఈ టైంలో వసూళ్లకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం ఇప్పట్లో రాకపోవచ్చు. ఇంకొద్ది రోజులు ఆగి పరిస్థితిని అంచనా వేసి అప్పుడు చెప్పబోతున్నారు తొందరేమీ లేదు.

సో పవన్ మహేష్ క్లాష్ ని ఎంజాయ్ చేద్దామనునకున్న మూవీ లవర్స్ దాన్ని మిస్ అయినట్టే. నూటా యాభై కోట్ల దాకా డైరెక్ట్ ఓటిటి ఆఫర్ భీమ్లా నాయక్ కు వచ్చిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపింది. అయితే నిర్మాతలు ఆ ఉద్దేశంలో లేరని అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇక సర్కారు వారి పాట షూటింగ్ కూడా వేగంగానే జరుగుతోంది కానీ చేతిలో ఉన్న 80 రోజుల్లో మొత్తం పూర్తవుతుందో లేదో అనే అనుమానాలు బయట ఉన్నాయి. సో ఏప్రిల్ అయితే ఎలాంటి టెన్షన్లు ఉండవు. మొత్తానికి 2022 ప్రారంభం నుంచే భారీ చిత్రాల సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. ప్రిపేర్ అయ్యి ఉండాల్సిందే

Also Read : RRR : 75 రోజుల సమయం – రాజమౌళి టీమ్ పరిగెత్తాల్సిందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి