iDreamPost

ఓటీటీలో అలా ఎలా ఇస్తారు? ఎగ్జిబిటర్లు సీరియస్

ఓటీటీలో అలా ఎలా ఇస్తారు? ఎగ్జిబిటర్లు సీరియస్

ఓటీటీల వల్ల థియేట్రికల్ రిలీజు, వాటితో ముడిపడిన అంశాలతో ఎప్పుడూ ఏదో ఒక దుమారం రేగుతూనే ఉంటుంది. తాజాగా ఓటీటీలు తీసుకొస్తున్న పేమెంట్ సిస్టమ్ తో కొత్త తలనొప్పులు మొదలయ్యాయని అంటున్నారు ఎగ్జిబిటర్లు.

ఓటీటీ ప్రవేశపెట్టిన ఈ పేమెంట్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా ఇబ్బంది పడేది ఎగ్జిబిటర్లే. థియేటర్లో సినిమా పడిన మూడు వారాలకే ఓటీటీలో ప్రసారమవ్వడంతో తల పట్టుకుంటున్నారు. ఓటీటీలు ఈ పేమెంట్ సిస్టమ్ ను ఇలాగే కొనసాగిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్తున్నారు.

పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు ఒక్క టికెట్ రేటుకన్నా తక్కువకే  ఓటీటీలో కుటుంబమంతా చూడగలిగేలా ఇస్తుంటే, ఇక థియేటర్ల వైపు ప్రేక్షకులు రారన్నది వారి ఆవేదన. తాజాగా సర్కారు వారి పాట సినిమా కూడా 21 రోజులకే ఓటీటీలో వచ్చేయడంతో ఉన్న పళంగా ఎగ్జిబిటర్లు అంతా హైదరాబాద్ వేదికగా సమావేశమయ్యారు.

ఓటీటీ నుంచి ఇదే వైఖరి కొనసాగితే థియేటర్ల రెంట్లు,  సినిమాలను విడుదల చేసి ఎలా తట్టుకొని నిలబడాలి? అనే అంశాలపై ఆలోచనలు చేసినట్లు తెలిస్తోంది. మొత్తంగా ఓటీటీ తీసుకొచ్చిన పెయిడ్ సిస్టమ్ మరోసారి ఎగ్జిబిటర్లను కలవరపెడుతోంది. మరి, ప్రస్తుతం వస్తున్న మార్పులకు ఎగ్జిబిటర్లు ఎలా సర్దుబాటు చేసుకుంటారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి