iDreamPost

ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

New Ration Card Telangana: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

New Ration Card Telangana: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో పలు పథకాలను అమలు చేస్తూ.. అర్హులైన వారికి లబ్ధి చేకూరుస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే సమయంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ కార్డుల మజూరు జరుగుతుందని అందరూ భావించారు. కానీ నెలలు గడుస్తున్నారు వాటి అంశం ప్రస్తావనకు రాలేదు. అయితే తాజాగా ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూసిన అంశం కొత్త రేషన్ కార్డుల జారీ. కారణం..ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి రేషన్ కార్డుతో ముడిపెడుతున్నారు. దీంతో చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడంతో కొన్ని పథకాలను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారనే ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం  చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు విధంగా ఏర్పాట్లు చేస్తుంది.

కొత్తరేషన్ కార్డుల అంశంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటికే ప్రజా పాలన పేరుతో లబ్దిదారుల నుంచి దరఖాస్తులు సేకరించిన విషయం అందరికి తెలిసిందేనని, అయితే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత కొత్త రేషన కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటన చేశారు. ఇక మంత్రి ప్రకటనతో కొద్ది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది.

గతేడాది డిసెంబర్ లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు స్కీమ్స్ పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో రేషన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి