iDreamPost

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్ డేట్.. ఇపై యూజర్లు..!

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్ డేట్.. ఇపై యూజర్లు..!

ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టెంట్ మెసేజ్ యాప్ వాట్సాప్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా తక్కువ సమయంలోనే ఈ యాప్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి తమ స్థానాన్ని కాపాడుకునేందుకు ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా.. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ దూసుకుపోతోంది. తాజాగా వాట్సాప్ ఒక క్రేజీ అప్ డేట్ తీసుకువచ్చింది.

వాట్సాప్ నెలనెలా అప్ డేట్స్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్, ఐవోఎస్ లకు విడిగా అప్ డేట్స్ తెస్తుంటుంది. తాజాగా యూజర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక అప్ డేట్ తీసుకొచ్చింది. అదేంటంటే.. ఇమేజెస్, వీడియోస్ ని హైక్వాలిటీలో సెండ్ చేయడం. ఇప్పటి వరకు వాట్సాప్ లో ఫొటోలు, వీడియోలు అన్నీ స్టాండర్డ్ క్వాలిటీలోనే వెళ్లేవి. అవి ఒరిజినల్ కాపీ అంత క్వాలిటీగా ఉండవు.

అందుకే చాలా మంది డాక్యుమెంట్ రూపంలో షేర్ చేస్తుంటారు. ఇకపై అలాంటి కష్టాలు అవుసరం లేదు. ఎందుకంటే మీరు నేరుగా హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు షేర్ చేయచ్చు. జూన్ మొదటి వారం నుంచే ఇందుకు సంబంధించిన టెస్టింగ్ జరుగుతూ వచ్చింది. వాట్సాప్ బీటీ ఇన్ఫో ఈ మేరకు వివరాలు వెల్లడించింది. కొందరు బీటా టెస్టర్లకు ఇమేజెస్ పంపతున్నప్పుడు మెసేజ్ బబుల్ HD అని కనిపిస్తోందంట.

అలాగే వీడియో సెండ్ చేసినప్పుడు కూడా అలాగే కనిపస్తోందని చెబుతున్నారు. ఈ ఫీచర్ తో 99 శాతం క్వాలిటీతో మీరు ఫొటోలు సెండ్ చేయచ్చు. అయితే వీడియో కోసం మాత్రం మీరు ప్రతిసారి మాన్యువల్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి సెలక్టెడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ విషయం తెలిశాక చాలా మంది వాట్సాప్ యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి