iDreamPost

నెట్​ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్.. ఇకపై మరింత కష్టం!

  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
నెట్​ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్.. ఇకపై మరింత కష్టం!

ఓటీటీలకు మూవీ లవర్స్ ఎంతగా అలవాటు పడ్డారో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. కొవిడ్ టైమ్​లో ఓటీటీల హవా మొదలైంది. సినిమా థియేటర్లు క్లోజ్​ అవడంతో ఆడియెన్స్ ఓటీటీల్లో తమకు నచ్చిన మూవీస్, వెబ్ సిరీస్​లు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇండియన్ మూవీస్​తో పాటు ఫారెన్ కంటెంట్​ను కూడా ఎక్కువగా చూశారు. దీంతో నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్​స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​కు ఒక్కసారిగా సబ్​స్రైబర్స్ పెరిగిపోయారు. కరోనా వెళ్లిపోయినా ఇంకా ఓటీటీల హవా నడుస్తోంది. సినిమాలకు హిట్ లేదా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడటం తగ్గిపోయింది.

మూడ్నాలుగు వారాల్లోనే కొత్త చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. వెబ్ సిరీస్​లు ఎలాగూ డిజిటల్ ప్లాట్​ఫామ్స్​లోనే స్ట్రీమింగ్ అవుతాయి. కాబట్టి ఓటీటీ సబ్​స్క్రిప్షన్ తీసుకునేందుకు ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అత్యధిక సబ్​స్ర్కైబర్స్ ఉన్న ఓటీటీ ప్లాట్​ఫామ్స్ లిస్టులో నెట్​ఫ్లిక్స్ ముందు వరుసలో ఉంటుంది. హాలీవుడ్​తో పాటు ఇతర విదేశీ భాషల కంటెంట్ నెట్​ఫ్లిక్స్​లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. అందుకే ఫిల్మీ గోయర్స్ దీని సబ్​స్క్రిప్షన్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే తమ యూజర్లకు నెట్​ఫ్లిక్స్ భారీ షాక్ ఇవ్వనుందని సమాచారం.

నెట్​ఫ్లిక్స్ త్వరలో లేదా వచ్చే ఏడాది సబ్​స్క్రిప్షన్ ధరల్ని పెంచే అవకాశం ఉందని వాల్​స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. నెట్​ఫ్లిక్స్ ధరల పెంపు మీద గతంలో వచ్చిన రిపోర్టుల్ని ఉటంకిస్తూ అవి నిజమేనంటూ తన తాజా కథనంలో వాల్​స్ట్రీట్ హైలైట్ చేసింది. అయితే సబ్​స్క్రిప్షన్ మార్పులపై క్లారిటీ లేదు. కానీ అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ముందుగా ధరల పెంపు ఉంటుందని మాత్రం తెలుస్తోంది. నెట్​ఫ్లిక్స్ నిర్ణయం ఇండియాకు వర్తిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, గతేడాది సబ్​స్క్రిప్షన్ రేట్స్​ను పెంచిన నెట్​ఫ్లిక్స్ ఇప్పుడు మరోమారు అలాంటి డెసిజన్ తీసుకోవడంపై యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: నడిరోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. CPR చేసి బతికించిన నటుడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి