iDreamPost

OTTలో వణికించే సిరీస్.. చనిపోయిన వాళ్లు బతికొచ్చి ఆ ఊరిలో..

Netfli OTT suggestions: ఓటీటీల్లో చాలానే యాక్షన్ సిరీస్లు ఉంటాయి. కానీ వాటిలో ఏది చూడాలో అర్థం కాదు. అందుకే మీకోసం ఓటీటీ సజీషన్ కింద ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ తీసుకొచ్చాం.

Netfli OTT suggestions: ఓటీటీల్లో చాలానే యాక్షన్ సిరీస్లు ఉంటాయి. కానీ వాటిలో ఏది చూడాలో అర్థం కాదు. అందుకే మీకోసం ఓటీటీ సజీషన్ కింద ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ తీసుకొచ్చాం.

OTTలో వణికించే సిరీస్.. చనిపోయిన వాళ్లు బతికొచ్చి ఆ ఊరిలో..

ఓటీటీలో ఉండటానికి చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, వాటిలో అన్నింటిని చూడలేం కదా? అందుకే ఒక్కోరోజు ఒకటనో.. ఒక సినిమాని రెండ్రోజులో చూస్తుంటాం. కొందరు మాత్రం వారానికి ఒక వెబ్ సిరీస్ అని టార్గెట్ పెట్టుకుని చూస్తూ ఉంటారు. కానీ, అలాంటి వారికి ప్రతివారం అద్భుతమైన వెబ్ సిరీస్ కావాలి అంటే కష్టం. కొత్తగా రిలీజ్ అయినా కూడా అవి అంత అద్భుతంగా ఉంటాయి అనడానికి లేదు. అయితే ఓటీటీల్లో ఎప్పుడో రిలీజ్ అయినా సిరీస్లు కూడా చాలానే ఉంటాయి. వాటిలో కూడా మనం చూడని ఎన్నో అద్భుతమైన సిరీస్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఇవాళ మీకోసం తీసుకొచ్చాం. ఇది కాస్త వణికించేలా కూడా ఉంటుంది.

ఓటీటీలో ఉండే సిరీస్లలో చాలామంది యాక్షన్ సిరీస్లు అంటే ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి నెట్ ఫ్లిక్స్ ఒక బెస్ట్ ఆప్షన్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెట్ ప్లిక్స్ నుంచి ఒక మంచి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. దాని పేరు గ్లిచ్. ఇది నెట్ ఫ్లిక్స్ లో గత ఎనిమిదేళ్లుగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మొత్తం 3 సిజన్స్ ఉన్నాయి. ఆ మూడు సీజన్స్ కి కలిపి మొత్తం 18 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ కాన్సెట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇదంతా ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఒక మారుమూల గ్రామంలో అందరూ సామాన్య జీవితం గడుపుతూ ఉంటారు.

Glitch Series

ఈ గ్లిచ్ సిరీస్ లో లీడ్ యాక్టర్ ఆ ఊరిలో సార్జంట్ గా చేస్తూ ఉంటాడు. అతనికి ఒకరోజు శ్మశానంలో వింతగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తాడు. అయితే అక్కడ ఒక లేడీ దుస్తులు లేకుండా కనిపిస్తుంది. అతని ఏమీ అర్థం కాదు. ఆమెను రెస్క్యూ చేసేందుకు నిర్ణయించుకుంటాడు. అయితే అతనికి అక్కడ షాకింగ్ విషయం కనిపిస్తుంది. ఆమె ఒక్కతి మాత్రమే కాకుండా ఆ స్మశానంలో ఇంకా కొంతమంది అలా బట్టలు లేకాం కనిపిస్తారు. వాళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాదు. అలా మొత్తం ఆరుగురు చావు నుంచి లేచొస్తారు. ఆ ఊరిలో ఎవరికీ ఈ విషయం అర్థం కాదు.

వీళ్లంతా వివిధ కారణాలతో కొన్నేళ్ల క్రితమే మరణించి ఉంటారు. వాళ్లు ఇలా సమాధుల నుంచి లేచొస్తారు. అయితే సార్జంట్ భార్య గర్భవతిగా ఉంటుంది. అతనకి ఒక షాకింగ్ విషయం ఏంటంటే.. అతని మొదటి భార్య మూడేళ్లక్రితం చనిపోతుంది. ఆమె కూడా చావు నుంచి తిరిగి వస్తుంది. అయితే వీళ్లంతా ఎలా తిరిగివచ్చారు? అసలు వాళ్లు మనుషులేనా? జాంబీలా? అలా సమాధుల నుంచి తిరిగి వచ్చిన వాళ్ల వల్ల గ్రామానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? వాళ్లు అలా ఎంతకాలం బతకగలరు? వంటి ఇంట్రస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మీరు నెట్ ఫ్లిక్స్ లో ఉన్న గ్లిచ్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇందులో మొత్తం 3 సీజన్స్ ఉన్నాయి. మరి.. గ్లిచ్ సిరీస్ స్టోరీ మీకెలా అనిపించింది? మీరు గ్లిచ్ చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి