iDreamPost

Ted Sarandos: రామ్ చరణ్ ఇంటికి నెట్ ఫ్లిక్స్ CEO! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Updated - 09:48 PM, Thu - 7 December 23

Netflix CEO Ted Sarandos at Ram Charan House: ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ రామ్ చరణ్, చిరంజీవిని కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Netflix CEO Ted Sarandos at Ram Charan House: ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ రామ్ చరణ్, చిరంజీవిని కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

  • Author Soma Sekhar Updated - 09:48 PM, Thu - 7 December 23
Ted Sarandos: రామ్ చరణ్ ఇంటికి నెట్ ఫ్లిక్స్ CEO! కారణం ఏంటంటే?

రామ్ చరణ్.. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్లు, సూపర్ హిట్లతో పాటుగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు ఈ మెగా పవర్ స్టార్. ఇక RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా మారాడు చరణ్. ఇదిలా ఉండగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ రామ్ చరణ్ తో భేటీ అయ్యాడు. ఈ సంఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి నెట్ ఫ్లిక్స్ సీఈవో చరణ్ ను కలవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ లో అడుగుపెట్టిన టెడ్ సరాసరి చరణ్ ఇంటికి వెళ్లాడు. అక్కడే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలుసుకున్నారు. వీరు అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. ముఖ్యంగా ఇండియాలో తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ ల గురించి, వ్యాపార విస్తరణ గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో పెట్టుబడులు పెట్టడానికి చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడా? అనే సందేహం కూడా ఈ భేటీతో ఫ్యాన్స్ లో వచ్చింది. మెగాస్టార్ తో సరదాగా, ఉత్సాహంగా మాట్లాడాడు నెట్ ఫ్లిక్స్ సీఈవో.

netfix ceo meet ramcharan

కాగా.. ఈ భేటీలో రామ్ చరణ్, మెగాస్టార్ తో పాటుగా సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు కూడా సరాండోస్ తో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ భేటీ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. నెట్ ఫ్లిక్స్ సీఈవో నేరుగా చరణ్ నివాసానికి ఎందుకు వెళ్లారు? వీరిద్దరు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్టీమింగ్ అయ్యి.. అత్యంత ప్రజాదారణ పొందిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. మరి ఈ భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి