iDreamPost

IPL 2024: విజయాలు ధోని ఖాతాలో.. ఓటములు రుతురాజ్ ఖాతాలోనా? రాయుడుకి సిద్దూ కౌంటర్!

లక్నోతో మ్యాచ్ లో ఓటమికి కారణం రుతురాజ్ గైక్వాడ్ పూర్ కెప్టెన్సీ అని విమర్శించాడు అంబటి రాయుడు. గైక్వాడ్ కు అండగా నిలబడుతూ రాయుడికి కౌంటర్ వేశాడు దిగ్గజ ప్లేయర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ.

లక్నోతో మ్యాచ్ లో ఓటమికి కారణం రుతురాజ్ గైక్వాడ్ పూర్ కెప్టెన్సీ అని విమర్శించాడు అంబటి రాయుడు. గైక్వాడ్ కు అండగా నిలబడుతూ రాయుడికి కౌంటర్ వేశాడు దిగ్గజ ప్లేయర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ.

IPL 2024: విజయాలు ధోని ఖాతాలో.. ఓటములు రుతురాజ్ ఖాతాలోనా? రాయుడుకి సిద్దూ కౌంటర్!

క్రికెట్ లాంటి టీమ్ గేమ్ లో గెలవడానికి ఏ ఒక్కరో కష్టపడితే చాలదు. జట్టులో అందరి ఆటగాళ్లు తమ స్థాయి మేరకు విజయం కోసం రాణించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపిస్తారు ప్లేయర్లు. కానీ కొన్ని మ్యాచ్ ల్లో వేరే ప్లేయర్లు గెలిపించినా.. ఒక్కడికే పేరొస్తుంది. అయితే ఓడిపోతే మాత్రం తప్పు అంతా కెప్టెన్ పైనే వేస్తారు. ప్రస్తుతం ఇదే టాపిక్ ను లేవనెత్తాడు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. లక్నోతో మ్యాచ్ లో ఓటమికి కారణం రుతురాజ్ గైక్వాడ్ పూర్ కెప్టెన్సీ అని విమర్శించాడు. గైక్వాడ్ కు అండగా నిలబడుతూ రాయుడికి కౌంటర్ వేశాడు దిగ్గజ ప్లేయర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ.

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర సెంచరీతో లక్నోను గెలిపించాడు మార్కస్ స్టోయినిస్. కేవలం 63 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 124 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు నికోలస్ పూరన్ 15 బంతుల్లో 34 పరుగులు, దీపక్ హుడా 6 బంతుల్లో 17* రన్స్ తో చెలరేగారు. అయితే ఈ మ్యాచ్ లో ఓటమికి కారణం రుతురాజ్ గైక్వాడ్ పూర్ కెప్టెన్సీ అని కామెంట్స్ చేశాడు అంబటి రాయుడు. “ఈ మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ పూర్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. అసలు డెత్ ఓవర్లలో ఇలాంటి ఫీల్డింగ్ సెట్ చేస్తారా? కెప్టెన్ గా అనుభవం లేకపోవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ రాయుడు కామెంట్స్ చేశాడు.

కాగా.. రాయుడు కామెంట్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు టీమిండియా మాజీ దిగ్గజం నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ. ” చెన్నై గెలిస్తే.. దాని క్రెడిట్ ఎంఎస్ ధోనికి ఇస్తారు. కానీ ఓడిపోతే మాత్రం కెప్టెన్ కి ఇస్తారా? గెలిచినప్పుడు ఇచ్చిన క్రెడిట్ ఓడినప్పుడు కూడా ఇవ్వాలి కదా? ధోని ఇప్పటికీ చెన్నై టీమ్ కు మెయిన్ థింక్ టాంక్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ విషయంపై నెటిజన్లు సైతం రియాక్ట్ అవుతున్నారు. సిద్దూ చెప్పింది కూడా నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి