iDreamPost

VIDEO: కేఏ పాల్​ను కలసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడుకున్నారంటే..?

  • Author singhj Published - 04:59 PM, Mon - 28 August 23
  • Author singhj Published - 04:59 PM, Mon - 28 August 23
VIDEO: కేఏ పాల్​ను కలసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడుకున్నారంటే..?

నవీన్ పొలిశెట్టి.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ మాటకొస్తే బాలీవుడ్ ఆడియెన్స్​కు కూడా బాగా పరిచయం ఉన్న పేరిది. తన యాక్టింగ్ టాలెంట్​తో టాలీవుడ్​తో పాటు ఉత్తరాదిన కూడా ఫ్యాన్ బేస్​ను పెంచుకున్నారీ యంగ్ హీరో. టాలీవుడ్​లో ఆయన హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సూపర్ హిట్స్​గా నిలిచాయి. ఇందులో అనుదీప్ కేవీ తెరకెక్కించిన ‘జాతిరత్నాలు’ అయితే డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. హిందీలో ‘చిచ్చోరే’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో నవీన్ పెర్ఫార్మెన్స్​కు ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది.

వరుస సక్సెస్​లతో ఫుల్ జోష్ మీదున్న నవీన్ పొలిశెట్టి నటించిన కొత్త చిత్రం ‘మిస్​ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’. ఇందులో నవీన్ సరసన అనుష్క శెట్టి హీరోయిన్​గా నటించారు. ‘జాతిరత్నాలు’ వంటి సూపర్ సక్సెస్ తర్వాత నవీన్ పొలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడం, స్టార్ హీరోయిన్ అనుష్క యాక్ట్ చేస్తుండటంతో ‘మిస్​ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమా మీద ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచేసింది. అయినా నవీన్ మాత్రం ఇంకా ప్రమోషన్స్​ చేస్తూ.. సినిమాను ఆడియెన్స్​కు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘మిస్​ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ప్రమోషన్స్​ను పరుగులు పెట్టిస్తున్నారు నవీన్ పొలిశెట్టి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను ఆయన చుట్టేస్తున్నారు. ఇలా ఆదివారం విశాఖపట్నంలో నవీన్ సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరో.. ప్రముఖ నేత కేఏ పాల్​ను కలవడం ఆసక్తికరంగా మారింది. వైజాగ్ బీచ్ రోడ్డులో నవీన్ కారులో వెళ్తుండగా.. అక్కడే ఒక కారులో కేఏ పాల్ షికారుకు వచ్చారు. దీంతో ఇంకో కారులో ఉన్న నవీన్ పొలిశెట్టి.. ఆయనకు హాయ్ చెప్పారు. కేఏ పాల్ కూడా నవీన్​ను పలకరించారు. అలా కాసేపు దూరం నుంచే ఈ ఇద్దరు ప్రముఖులు మాట్లాడకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. వీళ్లతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి