iDreamPost

AP అరుదైన ఘనత.. టెక్ హబ్​ల జాబితాలో​ రాష్ట్రం నుంచి మూడు నగరాలు!

  • Author singhj Published - 06:13 PM, Fri - 1 September 23
  • Author singhj Published - 06:13 PM, Fri - 1 September 23
AP అరుదైన ఘనత.. టెక్ హబ్​ల జాబితాలో​ రాష్ట్రం నుంచి మూడు నగరాలు!

ఇప్పుడు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. చాలా దేశాలు దీన్ని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. అమెరికా లాంటి కొన్ని బడా దేశాలు ఇప్పటికే టెక్ విప్లవంతో దూసుకెళ్తున్నాయి. కొత్త ఉద్యోగాల సృష్టి, లక్షలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉండటంతో టెక్నాలజీ డెవలప్​మెంట్​పై అన్ని దేశాలూ ఫోకస్ చేస్తున్నాయి. భారత్ కూడా సాంకేతిక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మన దేశంలోని చాలా రాష్ట్రాలు ఇదే దిశలో పయనిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఏపీ మరో అరుదైన ఘనత సాధించింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్​లో 26 డెవలప్ అవుతున్న టైర్-2 నగరాలు టెక్నాలజీ హబ్​లుగా అభివృద్ధి చెందుతున్నాయని డెలాయిట్ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలకు చోటు దక్కడం విశేషం. మన రాష్ట్రం నుంచి టెక్​ హబ్​లుగా అవతరిస్తున్న నగరాల లిస్టులో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే డెవలప్ అవుతున్న నగరాల్లో ఖర్చులు 25 నుంచి 30 శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండియాలో టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11 నుంచి 15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నారు. అంతేగాక ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్​లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వాళ్లు 60 శాతం మంది చిన్న పట్టణాల్లో ఉన్నట్లు సమాచారం. భారత్​లోని మొత్తం స్టార్టప్​ల్లో 39 శాతం (7 వేల కంటే ఎక్కువ) డీప్ టెక్ నుంచి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్​మెంట్ (బీపీఎం) వరకు పరిశ్రమలు విస్తరించి.. ఈ డెవలప్ అవుతున్న టైర్-2 నగరాల్లో పనిచేస్తున్నాయి. పెట్టుబడిదారులు కూడా ప్రస్తుతం పెద్ద నగరాల్లో కాకుండా చిన్న పట్టణాల్లోని సంస్థల్లో ఇన్వెస్ట్​ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో భారత్​లో మరిన్ని కొత్త నగరాలు టెక్ హబ్​లుగా మారతాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:
సైలెంట్​గా OTTలోకి వచ్చేసిన చిన్న చిత్రాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి