iDreamPost

సోషల్ మీడియాలో రూమర్లు, నరేశ్, పవిత్ర లోకేశ్ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్లు, నరేశ్, పవిత్ర లోకేశ్ రియాక్షన్

సీనియర్‌ నటుడు నరేశ్ మ‌ళ్లీ సోష‌ల్ మీడియా బాగా న‌లుగుతున్నారు. ఆయ‌న పెళ్లి వార్త ఇప్పుడు ట్రెండ్. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన, నటి పవిత్రా లోకేశ్‌ను నాలుగో వివాహం చేసుకోబోతున్నారంటూ గ‌ట్టిగానే ప్ర‌చారం న‌డుస్తోంది. కాని ఇంత‌వ‌ర‌కు పవిత్రతో వివాహంపై నరేశ్ అధికారికంగా స్పందించలేదు. లేటెస్ట్ గా, ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. ప‌విత్ర లోకేష్ గురించి గొప్ప‌గా చెప్పారు. తాను నిరాశలో ఉన్నప్పుడు, పవిత్ర అండగా నిలిచారని చెప్పారు.

ప‌విత్ర లోకేష్ తో పెళ్లి ప్ర‌చారం న‌డుస్తున్న‌వేళ‌, అస‌లు ఆయ‌న‌కు నాకు విడాకులు కాలేదు. ఇంకో పెళ్లి ఎలా చేసుకొంటారంటూ ఆయన మూడో భార్య రమ్య.. నరేశ్‌పై ఫైర్‌ అయ్యారు. ఆమె అక్క‌డితో ఆగ‌లేదు.
విడాకులు ఇవ్వకుండానే సీనియ‌ర్ స‌టి, పవిత్రా లోకేశ్‌ను నరేశ్‌ పెళ్లి చేసుకుంటున్నాడ‌న్న‌ది ఆమె ఆరోప‌ణ‌. మేం కలిసి లేం. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్‌ పెళ్లి ఎలా చేసుకొంటాడు? అని ప్రశ్నించారు.

నరేశ్‌ తన మూడో భార్య రమ్య ఆరోపణలను ఖండించారు. అదంతా అబద్ధమని, ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందన్నారు. గతంలో నా దగ్గర నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్‌ చేసింది. కృష్ణగారు చెబితేనే ప‌ది లక్షలిచ్చా. బ్లాక్‌ మెయిల్‌ చేసి ఎలాగైనా డబ్బు తీసుకోవాలని ఆమె ట్రైచేస్తోంది. 200లకు పైగా సినిమాల్లో, 100 మందికి పైగా హీరోయిన్స్‌తో వర్క్‌ చేశాను. ఎప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు. ఏలాంటి వాడినో అందరికి తెలుసు. నేను పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోలేదు. నాకు ఆమె గుడ్ ఫ్రెండ్. నాకు పవిత్ర ఎమోషనల్‌ సపోర్లే. పవిత్ర వచ్చింది నాలుగేళ్ల క్రిత‌మే. రమ్య నేను విడిపోయి 8 సంవత్సరాలు అవుతుంద‌ని, అంటూ వివరణ ఇచ్చారు.

పవిత్రపై మాజీ భ‌ర్త కామెంట్స్ చేశారు. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి అని లోకేశ్‌ భర్త డైరెక్టర్‌ సుచేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనని వదిలి వెళ్లిపోవ‌డానికి కార‌ణం, ఆమె పైలా పచ్చిస్‌ జీవితమని అన్నారు.
దీనిపై క్లారిటీ ఇచ్చారు ప‌విత్రా లోకేశ్. అస‌లు సుచేంద్ర నా భ‌ర్త కాదు. రిలేష‌న్ షిప్‌లో మాత్ర‌మే ఉన్నా. ఆ త‌ర్వాత విడిపోయి, ఆరేళ్లుగా సుచేంద్ర‌కు దూరంగా ఉంటున్నాన‌ని ప‌విత్ర లోకేష్ అన్నారు.

అంత‌కుముందు, న‌కిలీ అకౌంట్స్ తో త‌న‌పై అస‌భ్యంగా కామెంట్స్ చేస్తున్నారంటూ ప‌విత్రా లోకేశ్ మైసూర్ సైబర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి