iDreamPost

నరేష్ పవిత్రని అమ్ములు అంటాడు! ఆమె నరేష్ ని ఏమంటుందో తెలుసా?

  • Author ajaykrishna Updated - 10:49 AM, Wed - 6 September 23
  • Author ajaykrishna Updated - 10:49 AM, Wed - 6 September 23
నరేష్ పవిత్రని అమ్ములు అంటాడు! ఆమె నరేష్ ని ఏమంటుందో తెలుసా?

టాలీవుడ్ లో నరేష్ – పవిత్ర లోకేష్ జంట గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కొన్నాళ్ళుగా వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎలా ట్రెండ్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లు ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ తో వార్తల్లో నిలిచిన వీరిద్దరూ.. ఇప్పుడు ఒక్కటిగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. నరేష్, పవిత్రల క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇక వీరి పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో పక్కన పెడితే.. ప్రస్తుతం అయితే హ్యాపీగా ఉంటున్నారు. రీసెంట్ గా మళ్లీ పెళ్లి అనే సినిమా తీసి.. తమ కథనే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ బిజీగా గడిపేస్తున్నారు.

ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ పై సందడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య నరేష్ పవిత్రని ముద్దుగా ఏమని పిలుస్తాడు? అనే ప్రశ్నపై.. బాగా ప్రేమ పొంగిపోయినప్పుడు అమ్ములు, అమ్ము అని పిలుస్తుంటాడు అని ఆమె చెప్పింది. నరేష్ కూడా అవును నిజమే అని తలూపాడు. ఇప్పుడు కొత్తగా ఓ షోలో మెరిసిన పవిత్ర లోకేష్.. వినాయక చవితి సందర్బంగా ఓ టీవీ షోలో నరేష్ తో పాటు పాల్గొని సందడి చేసింది. కొన్నాళ్ళుగా వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగానే వెళ్తున్న విషయం విదితమే. అందులోనూ తమ కెమిస్ట్రీతో అందరిని ఆకట్టుకుంటున్నారు.

ఇక కొత్తగా పాల్గొన్న షోలో.. ఇద్దరు కలిసి మాస్టారు మాస్టారు పాటకు డాన్స్ చేశారు. కట్ చేస్తే.. ఈ పెర్ఫార్మన్స్ లో నరేష్ కి పవిత్ర ముద్దు కూడా పెట్టేసింది. అవును.. ముద్దు అంటే గుర్తొచ్చింది.. నరేష్ పవిత్రని ముద్దుగా అమ్ములు అంటాడు కదా! మరి నరేష్ ని పవిత్ర ఏమని పిలుస్తుంది? ఎలాంటి ముద్దు పేరు పెట్టింది? అనే టాపిక్ మొదలైంది. దీంతో పవిత్ర నరేష్ కి పెట్టిన ముద్దు పేరును బయట పెట్టేసింది. అదేంటంటే.. నరేష్ ని పవిత్ర ప్రేమగా ‘రాయ’ అని పిలుస్తుందట. ఆమె కన్నడకు చెందింది కదా.. రాయ అంటే అర్ధం ఏంటో గానీ, హస్బెండ్ అనే పదానికి దగ్గరగానే ఉండి ఉంటుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం వీరి ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి నరేష్ పవిత్ర జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి