iDreamPost

శ‌వ రాజ‌కీయాల్లో స‌క్సెస్ అయిన లోకేశ్ బాబు..!

శ‌వ రాజ‌కీయాల్లో స‌క్సెస్ అయిన లోకేశ్ బాబు..!

గ‌త ఏడాది కాలంగా ఏపీ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఏ దుర్ఘ‌ట‌న జ‌రిగినా దాని చుట్టూ టీడీపీ నేత‌లు చేరిపోతున్నారు. ఆందోళ‌న‌ల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ఆ విష‌యంలో కొన్ని సార్లు బాధిత కుటుంబాలే త‌మ జోలికి రావొద్ద బాబోయ్ అని మొత్తుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక హ‌త్యా ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు ఆ పార్టీ నేత‌లు చేస్తున్న హ‌డావిడి మామూలుగా ఉండ‌డం లేదు. ఒక వేళ అందులో అధికార పార్టీకి చెందిన నేత‌ల హ‌స్తం ఉంటే ప్ర‌శ్నించాల్సిందే. శిక్షించాల‌ని డిమాండ్ చేయాల్సిందే. ఆందోళ‌న‌లు చేయ‌డానికి ఓ మార్గం ఉంటుంది. కానీ శ‌వాల‌తో ఆందోళ‌న‌ల‌కు దిగ‌డం ఇటీవ‌ల కాలంలో బాగా పెరింది. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో సుబ్బయ్య హత్య కేసు వ్యవహారం అలాగే సాగింది.

అక్క‌డి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించిన పోలీసులు.. 

మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రొద్దుటూరు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆమె ఇదే విషయాన్ని చెప్పి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో లోకేష్ సహా టీడీపీ నేతలు మృతదేహంతో ధర్నాకు దిగారు. ఆ ముగ్గురి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే వరకు ప్రొద్దుటూరు వీడేదిలేదంటూ లోకేష్ ధర్నా కొనసాగించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్న తరుణంలో డీఎస్పీలు ప్రసాదరావు, నాగరాజు వచ్చి ఆందోళన విరమించాలని లోకేష్‌ను కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల ఆవేద‌న‌, అక్క‌డి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పోలీసులు వ్య‌వ‌హ‌రించారు. సెక్షన్‌ 161 ప్రకారం ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్లను కేసులో చేర్చుతున్నట్లు పోలీసులు తెలిపారు.అనంతరం డీఎస్పీ ఆధ్వర్యంలో సుబ్బయ్య భార్య అపరాజిత దగ్గర వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నమోదు చేసిన వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు అందించనున్నారు. ఈ హత్య కేసుపై 15 రోజుల్లో విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ ప్రసాదరావు హామీ ఇచ్చారు. హ‌త్య కేసులో వైసీపీ నేత‌ల హ‌స్తం ఉందా.. లేదా..? అనేది పోలీసుల విచార‌ణ‌లో తేలుతుంది. పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదులు మాని ఇలా మృత‌దేహాల‌తో ఆందోళ‌న‌లు దిగ‌డంపై ప‌లుర‌కాల విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి