iDreamPost

CM జగన్ నెత్తిన పాలు పోసిన లోకేశ్ రెడ్ బుక్!

YS Jagan: ఏ రంగంలోనైనా సరే మనం చేసే తప్పులు మనకు మాత్రమే నష్టం చేకూరుస్తాయి. కానీ రాజకీయ రంగంలో మాత్రం మన తప్పులు ప్రత్యర్థులకు వరంలా మారుతుంటాయి. తాజాగా ఏపీలో నారా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్ బుక్ అలానే జగన్ నెత్తిన పాలు పోసింది.

YS Jagan: ఏ రంగంలోనైనా సరే మనం చేసే తప్పులు మనకు మాత్రమే నష్టం చేకూరుస్తాయి. కానీ రాజకీయ రంగంలో మాత్రం మన తప్పులు ప్రత్యర్థులకు వరంలా మారుతుంటాయి. తాజాగా ఏపీలో నారా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్ బుక్ అలానే జగన్ నెత్తిన పాలు పోసింది.

CM జగన్ నెత్తిన పాలు పోసిన లోకేశ్ రెడ్ బుక్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ గురించి రాజకీయలపై అవగాహన లేని వారికి సైతం పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే..తనదైన ప్రసంగంతో నవ్వులు పూవ్వులు పూయిస్తూ ట్రోల్స్ కి గురవుతుంటారు. అంతేకాక తన మాటలతో ప్రత్యర్థి పార్టీలకు విజయవకాశాలు ఎక్కువ కల్పిస్తుంటారని చాలా మంది అభిప్రాయం. ఆయనకు రాజకీయాలపై సరైన అవగాహన, సామర్థ్యం లేకనే ఇలా ప్రత్యర్థుల పాలిట వరంలా మారుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా రెడ్ బుక్ అంటూ కొత్తపుస్తకాన్ని అందుకుని వైసీపీ నేతలను తెగ భయభ్రాంతులకు గురి చేశాని ఫీలయ్యాడు. అయితే వారు కూడా నిజంగానే భయపడ్డారు.. అయితే లోకేశ్ అనుకున్న విధంగా  అయితే మాత్రం కాదు. అదేవిధంగా రెడ్ బుక్ తీసుకొచ్చి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నెత్తిన లోకేశ్ పాలు పోశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా నారా లోకేశ్  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకున్నా, ఎమ్మెల్సీ అయి.. మంత్రిగా పని చేశారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల సమయంలో కూడా సైకిపోవాలి జగన్ రావాలి అంటూ, సైకిల్ గుర్తుకి మనం ఓట్టేస్తే..మన నాశనమే అన్నట్లు టగ్ స్లిప్ అయ్యే మాట్లాడారు.

గతేడాది నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కూడా అందరిని అయోమయానికి గురి చేసేలా ఆయన ప్రసంగించారు. ఈ పాదయాత్రలోనే రెడ్ బుక్ అనే ఒక పుస్తకాన్ని తయారు చేసుకున్నాడు. వైసీపీ శ్రేణున్ని, అధికారున్ని బెదరగొట్టి, రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవచ్చనే వ్యూహంతో లోకేశ్ ఈ రెడ్ బుక్ ను తెరపైకి తెచ్చాడు. ప్రతి దానికీ రెడ్ బుక్ చూపిస్తూ.. ఇందులో మీ పేర్లురాసుకున్నా, టీడీపీ అధికారంలోకి రాగానే మీ పని పడతా అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం ప్రారంభించాడు. ఇదే సమయంలో వైసీపీ నేతలు, అలానే అసంతృప్త నేతల్లో కూడా ఓ ఆలోచన వచ్చింది. టీడీపీ అధికారంలోకి  రాగానే అది చేస్తా, ఇది చేస్తా అని లోకేశ్ హెచ్చరిస్తున్నారు కదా, అసలు ఆ పార్టీకి అధికారం దక్కకుండా చేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనలో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నారంట.

లోకేశ్ ఎక్కువగా భయపెట్టి, వైసీపీలో అసంతృప్తులను సైతం జగన్ విజయం కోసం పని చేసేందుకు ఉసిగొల్పింది. వైసీపీలో అసంతృప్తులను ఎలా సర్థి చెప్పుకోవాలని ఆ పార్టీ ఆలోచిస్తున్న తరుణంలో, ఆ పని లోకేశ్  కారణంగా సులువైందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి దాక మనకెందులే అని ఊరుకున్న కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు అనివార్య పరిస్థితుల్లో మళ్లీ జగన్ ను గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో పని చేసేందుకు ఈ రెడ్ బుక్ కీలక పాత్ర పోషించిందనే టాక్ వినిపిస్తోంది. ఇలా రెడ్ బుక్ చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడం మాత్రం జగన్ నెత్తిన పాలు పోసినట్టే అని వైసీపీ నేతలు  అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి