iDreamPost

అర్ధరాత్రి రోడ్డుపై పవన్‌ కళ్యాణ్‌ రచ్చ! ఇంత ఓవర్‌యాక్షన్‌ అవసరమా?

అర్ధరాత్రి రోడ్డుపై పవన్‌ కళ్యాణ్‌ రచ్చ! ఇంత ఓవర్‌యాక్షన్‌ అవసరమా?

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ ప్రాజెక్ట్ పేరిట స్కామ్ కు పాల్పడి వందల కోట్లను కాజేసిన వ్యవహారంలో ఏపీ సీఐడీ నిన్న నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ ప్రాజక్ట్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సీఐడీ ఛీఫ్ ప్రకటించారు. అరెస్ట్ అనంతరం బాబును తాడేపల్లిలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు. సిట్ అధికారులు ప్రభుత్వ నిధులు స్వాహాపై చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే జనసేనా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్కామ్ కేసులో అరెస్టు అయిన బాబును కలిసేందుకు ఓ రేంజ్ లో ఓవరాక్షన్ చూపించాడు. పవన్ ప్రవర్తిస్తున్న తీరుకు జనం నవ్వుకుంటున్నారు. ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన వ్యక్తికి మద్దుతు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బాబును కలిసేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన పవన్ కళ్యాన్ ను బాబును కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుకు రోడ్డుపై కూర్చుని నానా రచ్చ చేశారు. అయితే దీనిపై ఇటు రాజకీయ విశ్లేకులతో పాటు అటు సామాన్య ప్రజలు కూడా పవన్ తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నైపుణ్యం పేరిట స్కిల్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసి రూ. 371 కోట్ల స్కామ్ కు తెరలేపిన బాబుకు ఏవిధంగా సమర్థిస్తున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా పవన్ మౌనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు ఈ కుంభకోణంలో పవన్ పాత్ర కూడా ఉందా అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పవన్ బాబును కాపాడేందుకు ఇంత రచ్చ చేస్తున్నారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ వ్యవహారంలో బాబు అతడి ముఠా బాగోతాలు బయటకు లాగుతున్నారు సీఐడీ అధికారులు. ప్రతి సారి ఏదో వంకతో జగన్ విమర్శించే పవన్ చంద్రబాబు పట్ల ఇంతటి ప్రేమ వలకబోయడానికి కారణం ఏంటని ఏకిపారేస్తున్నారు. తప్పును తప్పని చెప్పకుండా ఎందుకు తప్పు చేసిన వ్యక్తులను వెనకేసుకొస్తున్నారు.. బాబుపై ఉన్న ప్రేమ ఏపీ ప్రజలపై రాష్ట్ర అభివృద్ధిపై లేదా అంటూ జనం విరుచుకుపడుతున్నారు. పవన్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో చేస్తున్న డ్రామాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి