iDreamPost

అరెస్ట్‌ భయంతోనే లోకేష్‌ పాదయాత్ర వాయిదా వేశాడా?

అరెస్ట్‌ భయంతోనే లోకేష్‌ పాదయాత్ర వాయిదా వేశాడా?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్‌ స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజులుగా ఆయన రాజమండ్రిలోని సెంట్రల్‌లో ఉంటున్నారు. అయితే, తండ్రి అరెస్టయిన తర్వాతినుంచి లోకేష్‌ ఏపీకి వీలైనంత దూరంగా ఉంటూ వస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టయిన నాటినుంచి ‘యువగళం పాదయాత్ర’ సాగటం లేదు. ఈ నెల 29న పాదయాత్ర పునఃప్రారంభించాలని లోకేష్‌ భావించారు.

కానీ, మళ్లీ యాత్రను వాయిదా వేశారు. ఇందుకు బలమైన కారణమే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోకేష్‌ ఏపీకి రావాలంటే భయపడుతున్నారట. తాను ఏపీకి వస్తే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో తనను అరెస్ట్‌ చేస్తారని ఆయన భయపడుతున్నారట. అందుకే  ఇప్పట్లో యాత్రను తిరిగి ప్రారంభించే ఆలోచన చేయటం లేదట. ఏపీలో కంటే ఢిల్లీలోనే తాను సేఫ్‌గా ఉంటానని లోకేష్‌ భావిస్తున్నారట. ఇక, ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఆ పిటిషన్‌కు సంబంధించి ఈ నెల 29నుంచి విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్‌ వచ్చిన తర్వాత ఆయన జనంలోకి వెళ్లడానికి నిశ్చయించుకున్నట్లు సమాచారం. కానీ, కొంతమంది టీడీపీ నేతలు అరెస్ట్‌ అయితే సింపథీ వస్తుందని లోకేష్‌కు సూచించారట. లోకేష్‌ అరెస్ట్‌ అయితే, లాభాల కంటే నష‍్టమే ఎక్కువన్న ఆలోచనతో ఉన్నారట. అందుకే అరెస్ట్‌కు ఏ మాత్రం ఇష్టపడటం లేదట. ఇక, శుక్రవారం నంద్యాలలో జరగనున్న టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో.. పాదయాత్రపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి, లోకేష్‌ అరెస్ట్‌కు భయపడే పాదయాత్రకు దూరంగా ఉంటున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి