iDreamPost

తమిళ రాజకీయాల్లో కొత్త రచ్చ.. విజయ్‌పై పోటీ చేస్తానన్న నమిత

తమిళనాడులో నటీనటులకు రాజకీయాలు కొత్తకాదు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు పార్టీలను ఏర్పాటు చేయడం, విలీనం చేయడం చేస్తున్నారు. నటీమణులు పలు పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీని స్థాపించిన సంగతి విదితమే.

తమిళనాడులో నటీనటులకు రాజకీయాలు కొత్తకాదు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు పార్టీలను ఏర్పాటు చేయడం, విలీనం చేయడం చేస్తున్నారు. నటీమణులు పలు పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీని స్థాపించిన సంగతి విదితమే.

తమిళ రాజకీయాల్లో కొత్త రచ్చ.. విజయ్‌పై పోటీ చేస్తానన్న నమిత

తమిళనాడులో ఎన్నికల ముందు కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకు వస్తున్న సంగతి విదితమే. స్టార్ హీరోలంతా పార్టీలను ఏర్పాటు చేసి.. ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఉళగనాయగన్ కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో 2018లో పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ప్లారమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగింది పార్టీ. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరిలోకి దిగినప్పటికీ కూడా ఒక్క సీటు కూడా సాధించలేక పోయింది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు తమిళ తంబీల లొగిలిలో మరో నూతన పార్టీ పురుడు పోసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి విదితమే. తమిళగ వెట్రీ కళగం అనే పేరు పెట్టారు.

అయితే ఈ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే స్టార్ నటీమణి నమిత కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్ ఎక్కడ నుండి పోటీ చేస్తే.. అతడిపై పోటీ చేస్తానని పేర్కొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ  అభ్యర్థిగా విజయ్ పై పోటీ చేస్తానని, తెలివైన ప్రత్యర్తిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని, అందుకే అతడు ఎక్కడ బరిలోకి దిగితే.. ఆ స్థానం నుండే ప్రత్యర్థిగా పోటీ చేస్తానంటూ చెప్పింది. కాగా, ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఇక నెటిజన్లు అయితే ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. డిపాజిట్లు దక్కవు అంటూ టీజ్ చేస్తున్నారు. కాగా, మరికొందరు అతడిపై ఆమె గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం నమిత తమిళనాడులో బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జోరుగా ప్రచారంలో పాల్గొంటోంది. తమిళనాడు రాజకీయాల్లో స్టార్లు బరిలోకి దిగడం కొత్త కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు పార్టీలను ఏర్పాటు చేసి.. రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఎంజీఆర్, జయలలిత,కరుణా నిథి (రచయిత) మాత్రమే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మరీ ఆ పదవిని చేపట్టే  నెక్ట్స్ స్టార్ ఎవరో వెయిట్ చేయాల్సిందే. నమిత, విజయ్ కలిసి తమిళంలో పలు సినిమాలు కూడా చేశారు. తమిళంలో హిట్టైన అళగియ తమిళ్ మూవీని తెలుగులో మహా ముదురు అనే పేరుతో డబ్ కూడా అయ్యింది. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే గ్రేెటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో మూవీ కూడా పూర్తి చేసి.. రాజకీయాలకు పూర్తి స్థాయి సమయం కేటాయించనున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి