iDreamPost

MAA Elections – Nagababu: మా అన్నయ్య ఎప్పుడూ అలా వ్యవహరించలేదు

MAA Elections – Nagababu: మా అన్నయ్య ఎప్పుడూ అలా వ్యవహరించలేదు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రకటన ముందు నుంచే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల మీద ఆసక్తి రేగింది.. 2019- 2021 సంవత్సరాలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేసిన నరేష్ తన వారసుడిగా మంచు విష్ణును రంగంలోకి దించారు. మరోపక్క నటుడు ప్రకాష్ రాజ్ కూడా మెగాస్టార్ కుటుంబం మద్దతుతో రంగంలోకి దిగారు. మెగాస్టార్ కుటుంబం నుంచి నాగబాబు మినహా ఎవరూ బహిరంగంగా బయటకు వచ్చే సపోర్ట్ చేయక పోయినా నాగబాబు చేసిన కామెంట్లు ప్రకాష్ రాజ్ మీద ముందు నుంచి వచ్చిన సానుభూతికి అడ్డుకట్ట వేసి ఓటమికి కారణం అయ్యాయి అనే చెప్పాలి. ఏదైతేనేం మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ఇలాంటి సంకుచిత భావాలతో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను సభ్యుడిగా ఉండలేను అని తన సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేశారు.. ప్రకాష్ రాజ్ కూడా ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా, తరువాత తన ప్యానల్ కు సంబంధించిన 11 మంది చేత రాజీనామా చేయించిన తర్వాత తెలుగు వాడు మాత్రమే పోటీ చేయాలి అంటూ మారుస్తానంటున్న బైలాస్ మార్చకుండా ఉంటానని మాట ఇస్తే అప్పుడు రాజీనామా వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం మీద నాగబాబు మరో సారి స్పందించారు. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఫోన్ ఇన్ ఇచ్చిన నాగబాబు ఇకపై తాను ‘మా’ అసోసియేషన్‌ సభ్యుడిగా కొనసాగాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.

‘సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతాయి అని వింటామో అన్ని అక్రమాలు ‘మా’ ఎన్నికల్లో జరిగాయని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు తెలుగు వాళ్లకు ప్రాంతీయవాదం ఉండదు, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్నా కానీ, ఎన్నికల తర్వాత ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదని నాగబాబు చెప్పుకొచ్చారు. అంతేకాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి పోటీ గా ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(ఆత్మ) అనే ఒక దానిని స్థాపించాలి అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి, దానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తోందట కదా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశాలు లేవు అని చెప్పుకొచ్చారు. ఒకవేళ చేయాలి అనుకుంటే నిక్కచ్చిగా మీడియా ముందుకు వచ్చి కొత్త అసోసియేషన్ ప్రారంభిస్తామని అన్నారు. ఇక సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య ఎప్పుడూ అనుకోలేదన్న నాగబాబు పరిశ్రమకు చెందిన నటీనటులు, ఇతర వ్యక్తులు, అభిమానులు ఇలా ఎవరైనా కష్టమంటూ మా ఇంటికి వస్తే ఆయన తనకు చేతనైనంత సాయం చేశారు తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదని చెప్పుకొచ్చారు. చిరంజీవికి అంత అహంకారం లేదు అని నాగబాబు అన్నారు.

అయితే ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటూ కొత్తగా ఒక అసోసియేషన్ ప్రారంభిస్తారని, మెగా ఫ్యామిలీకి మద్దతు ఇచ్చే నటీనటులందరూ ఈ కొత్త అసోసియేషన్ లో చేరతారని ప్రచారం జరగగా అంతా ఓట్టిదే అని తేలింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉండే వారు . అలాంటిది ఆయన స్థాపించి ఆయన ప్రెసిడెంట్ గా చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి పోటీగా మరో అసోసియేషన్ స్థాపించడం అనేది అర్థం లేని చర్యగానే భావించవచ్చు. అందుకే నాగబాబు అండ్ కో వెనుకడుగు వేసే ఉండొచ్చు. అయితే దాసరి మరణం తరువాత చిరంజీవి సినిమా ఇండస్ట్రీ పెద్దగా అందరూ భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలలో మంచు విష్ణు గెలుపు మెగా ఫ్యామిలీ సపోర్టర్స్ అందరికీ ఒక చెంపపెట్టులా మారింది. నిజానికి దాసరి నారాయణరావు చిరంజీవి కంటే ఎక్కువ మోహన్ బాబుతోనే క్లోజ్ గా ఉండే వారు. అలా ఇప్పుడు తెర మీదకి కొత్త ఈక్వేషన్ లు వచ్చినా ఆశ్చర్యం లేదు.. ఇప్పుడు స్వయానా నాగబాబే మా అన్నయ్యకి ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించాలనే కోరిక లేదన్న మాటలు మాట్లాడడం ఇప్పుడు కొత్త చర్చలకు దారి తీసే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి